జాతీయ విద్యా విధానం–2020లో భాగంగా జిల్లా పరిషత్ హై స్కూల్ కరపలో మండలంలోని 65 పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు విద్యాంజలి 2.0పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో రిసోర్స్ పర్సన్స్ పి సత్యనారాయణ, ఆర్. త్రిమూర్తులు, ఎన్.వి.ఎస్.ఎస్. విశ్వేశ్వరరావు, ఏ. మంగాదేవి విద్యాంజలి 2.0 ఫై వివరించారు. వెబ్‌సైట్‌లో పాఠశాలలు రిజిస్ట్రేషన్ చేసుకుని అవసరమైన మౌలిక సదుపాయాలు, నాలెడ్జ్ రిసోర్సులు అప్లోడ్ చేయవచ్చని తెలిపారు.అలాగే దాతలు, ఎన్జీవోలు, సీఎస్‌ఆర్ సంస్థలు స్వచ్ఛందంగా పాఠశాలలకు సహకారం అందించవచ్చని పేర్కొన్నారు.ఈ కార్యక్రమం పాఠశాల–సమాజం మధ్య వారధిగా పనిచేస్తుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎంఈఓ కె. బుల్లి కృష్ణవేణి, బి. దుర్గారాణి, పలక రాజు, సత్యనారాయణ, సారకుమారి, నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.









