Search
Close this search box.

  నటి రష్మిక మందన్న పెళ్లిపై ఆసక్తికర వ్యాఖ్యలు..

November 8, 2025 3:41 PM | Aditya369 News

నటి రష్మిక మందన్న పెళ్లిపై ఆసక్తికర వ్యాఖ్యలు..

సినిమా నటి రష్మిక మందన్న తన పెళ్లి గురించి, తనకి కాబోయే భర్త గురించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. యంగ్ హీరో విజయ్ దేవరకొండతో నిశ్చితార్థం అయిందనే వార్తలు కొంతకాలంగా వస్తున్న నేపథ్యంలో, తాజాగా ఓ చిట్‌చాట్‌లో పాల్గొన్న రష్మికకు తన భాగస్వామికి ఉండాల్సిన లక్షణాల గురించి ప్రశ్న ఎదురైంది. ఈ ప్రశ్నకు రష్మిక స్పందిస్తూ, తనను పూర్తిగా అర్థం చేసుకునే వ్యక్తిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని, తన వైపు నుంచి ప్రతి విషయాన్ని ఆలోచించి, తన పనిని గౌరవించే వ్యక్తి కావాలని, ఎలాంటి పరిస్థితులనైనా ధైర్యంగా ఎదుర్కొనే సత్తా అతనికి ఉండాలని తన మనసులోని మాట బయటపెట్టింది.

అంతటితో ఆగకుండా, మంచి వ్యక్తిత్వంతో పాటు, తన కోసం యుద్ధం చేయగల ధైర్యం తనకి కాబోయే భర్తకు ఉండాలని రష్మిక పేర్కొన్నారు. అలాంటి వ్యక్తి తన జీవితంలోకి వస్తే, అతని కోసం తాను ఎంత దూరమైనా వెళ్తానని, అవసరమైతే యుద్ధంలో తూటాకు కూడా ఎదురెళ్లడానికి సిద్ధంగా ఉన్నానని తన ప్రేమను, నిబద్ధతను తెలియజేశారు. ఈ వ్యాఖ్యలు ప్రేమ, బంధంపై ఆమెకు ఉన్న లోతైన అభిప్రాయాన్ని తెలియజేస్తున్నాయి.

రష్మిక చెప్పిన లక్షణాలన్నీ యంగ్ హీరో విజయ్ దేవరకొండకు సరిగ్గా సరిపోతాయని, అతడిని ఉద్దేశించే ఆమె ఈ వ్యాఖ్యలు చేసిందని నెటిజన్లు ప్రస్తుతం చర్చించుకుంటున్నారు. ఈ వ్యాఖ్యలు, ఆమె, విజయ్ దేవరకొండ మధ్య ఉన్నట్లుగా వార్తలు వస్తున్న నిశ్చితార్థం మరియు పెళ్లి పుకార్లకు మరింత బలం చేకూర్చినట్లు అయ్యాయి.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore