సినిమా రంగంలో కృష్ణ, మహేష్ బాబు వంటి అగ్ర నటులున్న కుటుంబం నుంచి వచ్చినా, తన ప్రయాణం గురించి హీరో సుధీర్ బాబు ఇటీవల జరిగిన ‘జటాధర’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనను ఎవరైనా కృష్ణ గారి అల్లుడు, మహేష్ బాబు బావ అని పిలిస్తే తాను గర్వంగా ఒప్పుకుంటానని, ఇలాంటి నిజాలు ఒప్పుకోవాలంటే గట్స్ ఉండాలని ఆయన అన్నారు. అయితే, వారి వల్ల ఇండస్ట్రీలో తనకు అదనంగా ఒక కాఫీ మాత్రమే లభించిందని, మిగతావన్నీ తాను స్వయంగా కష్టపడి సంపాదించుకున్నవేనని సుధీర్ బాబు స్పష్టం చేశారు.
ఒక హీరోకి ఉండాల్సిన క్వాలిటీస్ అన్నీ సుధీర్ బాబుకు ఉన్నప్పటికీ, ‘ప్రేమ కథా చిత్రం’ తర్వాత ఒక్క హిట్ కూడా లేకపోవడం ఆయన కెరీర్‌కు ‘ఆవగింజంత అదృష్టం కరువయ్యింది’ అన్నట్లుగా ఉంది. అయినప్పటికీ, సుధీర్ బాబు తనవంతు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. తాజాగా, సోనాక్షి సిన్హా ప్రధాన పాత్రలో వెంకట్ కళ్యాణ్, అభిషేక్ జైస్వాల్ దర్శకత్వంలో రూపొందుతున్న తన తాజా చిత్రం ‘జటాధర’ ప్రమోషన్స్‌లో భాగంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
డివోషనల్ కంటెంట్‌తో, భారీ గ్రాఫిక్స్‌తో వస్తున్న ‘జటాధర’ సినిమా నవంబర్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా గురించి మాట్లాడుతూ, ఇందులో తాను దెయ్యాలను వెంటాడే వ్యక్తి పాత్రలో కనిపిస్తానని, శివుడి నేపథ్యంలో వచ్చే సీన్స్ గూస్‌బంప్స్ తెప్పిస్తాయని సుధీర్ బాబు తెలిపారు. ఇలాంటి పాత్రను ఇప్పటివరకూ ఎవ్వరూ చేయలేదని ఆయన చెప్పుకొచ్చారు. ఆయన చేసిన ఈ బోల్డ్ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి









