Search
Close this search box.

  ‘బాహుబలి 3’ కాదు, ‘బాహుబలి ఎటర్నల్ వార్’: యానిమేషన్ మూవీని ప్రకటించిన రాజమౌళి, రూ.120 కోట్ల బడ్జెట్

ప్రభాస్, రానా, రాజమౌళి కలిసి పాల్గొన్న స్పెషల్ ఇంటర్వ్యూలో ‘బాహుబలి’ ఫ్రాంచైజీకి సంబంధించిన మూడో భాగం గురించి ప్రస్తావన వచ్చింది. అక్టోబర్ 31న విడుదల కాబోతున్న ‘బాహుబలి ఎపిక్’ (రెండు భాగాలను కలిపిన ఎడిషన్) ప్రమోషన్స్‌లో భాగంగా రాజమౌళి కీలక ప్రకటన చేశారు. ‘బాహుబలి 3’ గురించి ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నప్పటికీ, అది రెగ్యులర్ సినిమాలా రాదని రాజమౌళి స్పష్టం చేశారు. దీనికి ‘బాహుబలి ఎటర్నల్ వార్’ అనే టైటిల్‌ను ఖరారు చేశానని, ఈ యానిమేషన్ సినిమా టీజర్‌ను ‘బాహుబలి ఎపిక్’ సినిమా చివర్లో విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఈ ప్రకటన ‘బాహుబలి’ అభిమానులకు భారీ సర్ ప్రైజ్ ఇచ్చింది.

‘బాహుబలి ఎటర్నల్ వార్’ సినిమా యానిమేషన్ ఫార్మాట్‌లో, 3D యానిమేషన్ చిత్రంగా రూపొందనుంది. ఇది బాహుబలి సినిమాకు కంటిన్యుటీగా ఉంటుందని రాజమౌళి తెలిపారు. ఈ ప్రాజెక్ట్ కోసం ఇప్పటికే రెండున్నరేళ్లుగా వర్క్ జరుగుతోందని, ప్రముఖ 3D యానిమేషన్ డైరెక్టర్ ఇషాన్ శుక్ల దీనికి దర్శకత్వం వహిస్తున్నారని వెల్లడించారు. ఈ భారీ యానిమేషన్ చిత్రానికి సుమారు 120 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించినట్లు రాజమౌళి తెలిపారు. ఈ యానిమేషన్ సినిమాలో ట్విస్టులు ఉంటాయని, కథా కథనం బాగుంటుందని, ‘బాహుబలి’లోని అన్ని ప్రధాన పాత్రలు ఇందులో కనిపిస్తాయని ఆయన పేర్కొన్నారు.

రాజమౌళి ప్రకటనతో ‘బాహుబలి’ వరల్డ్ ఇక్కడితో ఆగదని, మున్ముందు ఏదో ఒక రూపంలో వస్తూనే ఉంటుందని స్పష్టమైంది. దీని ద్వారా రాజమౌళి ఈ ఫ్రాంచైజ్‌ను విస్తృతం చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ‘బాహుబలి ఎటర్నల్ వార్’ యానిమేషన్ సినిమా విడుదల తేదీని రాజమౌళి ఇంకా ప్రకటించనప్పటికీ, ఈ ప్రాజెక్ట్ కోసం ప్రభాస్, ‘బాహుబలి’ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ‘బాహుబలి ఎపిక్’ రిలీజ్ అయిన వెంటనే ఈ యానిమేషన్ టీజర్ రాబోతుండటంతో ఆసక్తి మరింత పెరిగింది.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు