Search
Close this search box.

  థామా’ తెలుగు కలెక్షన్లు: రష్మిక క్రేజ్‌కు షాక్, రెండు రోజుల్లో రూ. 35 లక్షలే!

టాలీవుడ్‌లో అగ్ర హీరోయిన్‌గా వెలుగొందుతున్న రష్మిక మందన్న నటించిన తాజా చిత్రం ‘థామా’ తెలుగు కలెక్షన్లు ట్రేడ్ వర్గాలను విస్మయానికి గురిచేశాయి. ఈ సినిమా హిందీలో హారర్ కామెడీ ఫ్రాంచైజీలో భాగంగా విడుదలైంది. దాంతో బాలీవుడ్ ఆడియన్స్ నుంచి మంచి ఆదరణ లభించి, రెండు రోజుల్లో ఇండియాలో రూ. 40 కోట్ల నెట్ కలెక్షన్ సాధించింది. అయితే, రష్మిక కన్నడ అమ్మాయి అయినప్పటికీ, తెలుగులో స్టార్ స్టేటస్ సంపాదించినప్పటికీ, ఆమెను చూసేందుకు టాలీవుడ్ ఆడియన్స్ ఈ సినిమా కోసం థియేటర్లకు పెద్దగా వెళ్ళలేదు. రెండు రోజుల్లో ‘థామా’ తెలుగు వెర్షన్ నెట్ కలెక్షన్లు కేవలం రూ. 35 లక్షలు మాత్రమే నమోదయ్యాయి.

‘థామా’ సినిమాను తెలుగులో సరిగా ప్రమోట్ చేయకపోవడం ఒక కారణంగా చెప్పవచ్చు. అయితే, రష్మిక కోసం కూడా ప్రేక్షకులు థియేటర్లకు రాలేదనేది స్పష్టమవుతోంది. మొదటి రోజు రూ. 25 లక్షల నెట్ కలెక్షన్ రాగా, రెండో రోజుకు అది రూ. 10 లక్షలకు పడిపోయింది. ఈ విధంగా రోజుకు కనీసం రూ. 50 లక్షలు కూడా రాకపోవటం ఆశ్చర్యకరం. రష్మిక లాంటి స్టార్ హీరోయిన్ నటించిన సినిమాకు ఇంత తక్కువ కలెక్షన్లు రావడం ఆమె స్టార్ స్టేటస్ మీద ప్రభావం చూపించే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అంటున్నారు.

నవంబర్ 7న రష్మిక ప్రధాన పాత్రలో రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించిన ‘ది గర్ల్ ఫ్రెండ్’ రిలీజుకు సిద్ధమవుతోంది. ఒకవేళ ఆ మూవీకి కూడా సరిగా కలెక్షన్స్ రాకపోతే, స్టార్ హీరోలు లేకపోతే రష్మికను చూసేందుకు ఎవరూ రారని టాలీవుడ్‌లో స్టాంప్ వేసే ప్రమాదం ఉంది. ‘పుష్ప’, ‘యానిమల్’, ‘ఛావా’, ‘కుబేర’ వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ రష్మిక ఖాతాలో ఉన్నప్పటికీ, ఆమె క్రేజ్ ఒక సోలో హీరోయిన్‌గా తెలుగు ఆడియన్స్‌ను థియేటర్లకు రప్పించలేకపోయిందనేది ‘థామా’ కలెక్షన్ల ద్వారా స్పష్టమవుతోంది.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు