Search
Close this search box.

  బాలీవుడ్ దర్శకుడు రాజ్ నిడిమోరు ఇంట్లో సమంత దీపావళి సెలబ్రేషన్స్

నటీమణి సమంత రూత్ ప్రభు ఈసారి దీపావళి వేడుకలను బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు రాజ్ నిడిమోరు (Raj Nidimoru) ఇంట్లో జరుపుకున్నారు. ఈ వేడుకల్లో ఆమె పాల్గొనడం సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. సమంత స్వయంగా రాజ్ కుటుంబ సభ్యులతో కలిసి దీపావళిని సెలబ్రేట్ చేస్తూ, బాణసంచా కాల్చిన ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. “నా మనసు కృతజ్ఞతతో నిండిపోయింది” అంటూ ఆమె పెట్టిన క్యాప్షన్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వేడుకలో సామ్ సాంప్రదాయ దుస్తుల్లో, సింపుల్ లుక్‌లో కనిపించి అభిమానులను ఆకట్టుకున్నారు.

రాజ్ నిడిమోరు – డీకే జంట తెరకెక్కించిన వెబ్ సిరీస్ ‘ది ఫ్యామిలీ మాన్’ ద్వారానే సమంతకు బాలీవుడ్‌లో ప్రత్యేక గుర్తింపు వచ్చింది. ఆ సిరీస్‌లో ఆమె పోషించిన రాజీ పాత్ర ప్రేక్షకులను మెప్పించడంతో హిందీ ప్రేక్షకుల్లో ఆమెకంటూ ప్రత్యేక ఫాలోయింగ్ పెరిగింది. ఈ ప్రాజెక్ట్‌ తర్వాత సమంత, రాజ్ నిడిమోరా మధ్య స్నేహం మరింత బలపడిందని సినీ వర్గాలు చెబుతున్నాయి. తాజాగా దీపావళి వేడుకల్లో కూడా ఇద్దరూ కలిసి కనిపించడంతో, వారి మధ్య ఉన్న బంధం గురించి కొత్త చర్చలు, గాసిప్స్‌ మొదలయ్యాయి.

గత కొంతకాలంగా సమంత – రాజ్ నిడిమోరా మధ్య స్నేహం కంటే ఎక్కువ సంబంధం ఉందా? అనే గాసిప్స్‌ బాలీవుడ్ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈ ఊహాగానాలపై ఇరువురు ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. సమంత ప్రస్తుతం సినిమా ప్రాజెక్టుల నుంచి కొంత విరామం తీసుకొని ఆరోగ్యంపై దృష్టి సారిస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు రాజ్ నిడిమోరా తన కొత్త వెబ్ సిరీస్ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ దీపావళి వేడుక ఫొటోలు అభిమానులను ఆకట్టుకుంటూ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు