‘మిరాయ్’తో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్న తేజసజ్జా, ఈ సినిమా తన కెరీర్‌లో మైలురాయిగా నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ విజయానంతరం తేజపై అంచనాలు మరింత పెరిగాయి. తాజాగా ప్రమోషన్లలో భాగంగా ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలో కీలక విషయాలు బయటపడ్డాయి.
మిరాయ్-2 వస్తుంది!
తేజ మాట్లాడుతూ – “మిరాయ్-2 ఖచ్చితంగా ఉంటుంది. రానాకు ఇంకా స్క్రిప్ట్ చెప్పలేదు. కానీ ఈ సీక్వెల్ మొదటి పార్ట్‌ను మించిపోతుంది. అందులో కొన్ని సర్‌ప్రైజ్‌లు కూడా ఉంటాయి. అయితే కొంత టైమ్ పడుతుంది” అని చెప్పారు.
జై హనుమాన్ అప్‌డేట్
ప్రస్తుతం ప్రశాంత్ వర్మ, రిషబ్ శెట్టి తమ ప్రాజెక్ట్‌లలో బిజీగా ఉన్నారని, అవి పూర్తయ్యాకే జై హనుమాన్ సినిమా మొదలవుతుందని తేజ క్లారిటీ ఇచ్చాడు. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు జోరుగా సాగుతున్నాయని చెప్పారు.
జాంబిరెడ్డి-2 రెడీ
జాంబిరెడ్డి సీక్వెల్ కూడా రెడీ అవుతుందని, ఈసారి మరింత కామెడీతో పాటు పక్కా యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రాబోతుందని తేజ హింట్ ఇచ్చాడు.
ప్రస్తుతం ఆయన చెప్పిన ఈ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో రాబోయే రోజుల్లో తేజ నుంచి వరుస హై వోల్టేజ్ సినిమాలు ఖాయమని అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.









