Search
Close this search box.

  ‘మిరాయ్ 2’లో విలన్ గా ఆ స్టార్..?

‘హనుమాన్’తో ఒక్కసారిగా పాన్ ఇండియా హీరోగా ఎదిగిన తేజ సజ్జా, ఇప్పుడు మరో క్రేజీ ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

‘ఈగిల్’ దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని డైరెక్షన్‌లో, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ‘మిరాయ్’లో తేజ సూపర్ యోధుడిగా మెరిశాడు. హీరోకి ప్రతినాయకుడిగా మంచు మనోజ్ నటించడం సినిమా మీద మరింత క్రేజ్ తెచ్చింది. ట్రైలర్‌నే అంచనాలను మితిమీరేలా పెంచింది.

ఈ రోజు ‘మిరాయ్’ ప్రపంచవ్యాప్తంగా విడుదలై, మొదటి షో నుంచే బ్లాక్‌బస్టర్ టాక్‌ను సొంతం చేసుకుంది. సూపర్ యోధుడిగా తేజ అదరగొట్టాడు అని ప్రతి చోటా పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. సినిమా చివర్లో సర్‌ప్రైజ్‌గా సీక్వెల్ టైటిల్ ‘మిరాయ్ జైత్రయా’ను ప్రకటించడంతో ఫ్యాన్స్‌లో ఆనందం వెల్లివిరిసింది. అంతేకాక, ఈ సీక్వెల్‌లో విలన్‌గా రానా దగ్గుబాటి కనిపించబోతున్నాడనే న్యూస్ సంచలనంగా మారింది.

ఇప్పుడు అందరి దృష్టి ‘మిరాయ్ జైత్రయా’పై కేంద్రీకరించబడింది. కానీ ఈ సీక్వెల్ ఎప్పుడు సెట్స్‌పైకి వెళ్తుంది, ఎప్పుడు రిలీజ్ అవుతుంది అన్నది ఆసక్తికర ప్రశ్నగానే మిగిలింది.

 

ఇక తేజ సజ్జా ప్రస్తుతానికి ‘హనుమాన్’ సీక్వెల్ – ‘జై హనుమాన్’లో నటిస్తున్నాడు. ఇందులో తేజ పాత్ర చిన్నదైనా చాలా కీలకంగా ఉండనుంది. అలాగే, ‘జాంబీ రెడ్డి 2’ను కూడా ఇటీవలే పీపుల్స్ మీడియా ప్రకటించింది. కాబట్టి ముందు ‘జై హనుమాన్’, ‘జాంబీ రెడ్డి 2’ పూర్తి చేసిన తర్వాతే ‘మిరాయ్ జైత్రయా’పై క్లారిటీ రానుంది..

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు