ప్రస్తుతం పాన్ ఇండియా ఆడియెన్స్ ఎదురుచూస్తున్న సినిమాల్లో టాప్ లిస్ట్‌లో నిలిచిన చిత్రం “కాంతార చాప్టర్–1”. నటుడు–దర్శకుడు రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మైథలాజికల్–డివోషనల్ డ్రామా, షూటింగ్ దశ నుంచే దేశవ్యాప్తంగా భారీ అంచనాలను క్రియేట్ చేసింది.
ఇప్పటికే అందరికీ తెలిసిందే… మొదటి భాగం “కాంతార” కల్చరల్ రూట్స్, ఫోక్ ఎలిమెంట్స్‌తో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుని, కేవలం కన్నడలోనే కాకుండా పాన్ ఇండియా స్థాయిలో సంచలన హిట్‌గా నిలిచింది. ఆ విజయమే ఇప్పుడు “చాప్టర్–1” పై హైప్‌ను మరింత రెట్టింపు చేసింది.
తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం, ఈసారి సినిమా కేవలం పాన్ ఇండియా స్థాయికి పరిమితం కాకుండా, గ్లోబల్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారని టాక్. గతంలో కాంతార మొదటి భాగాన్ని ఇంగ్లీష్‌తో పాటు ఇటాలియన్, స్పానిష్ వెర్షన్‌లలో ఓటీటీలో రిలీజ్ చేశారు. ఆ ప్రయోగానికి మంచి రెస్పాన్స్ రావడంతో, ఇప్పుడు మేకర్స్ మరింత ముందుకెళ్లి ఇంగ్లీష్ థియేట్రికల్ రిలీజ్, అలాగే స్పానిష్ వెర్షన్‌లో కూడా విడుదల చేయాలని నిర్ణయించినట్టు వార్తలు వస్తున్నాయి.
అయితే, ఈ ప్రయత్నం నిజంగా వర్కౌట్ అవుతుందా అన్నది పెద్ద ప్రశ్నగానే ఉంది. ఎందుకంటే ఇంతకు ముందు పలు పాన్ ఇండియా సినిమాలు వేర్వేరు భాషల్లో విడుదలైనా, వాటిలో చాలా వరకు సక్సెస్ సాధించలేకపోయాయి. భాష, సంస్కృతి భిన్నతలు కూడా అడ్డంకిగా మారాయి. అయినప్పటికీ, కాంతార లాంటి కథలోని నేటివ్ కనెక్ట్ మరియు యూనివర్సల్ ఎమోషన్స్ కారణంగా ఈ సినిమా గ్లోబల్ ఆడియెన్స్‌ను కూడా ఆకర్షించే అవకాశం ఉందని ఇండస్ట్రీ టాక్.
రిషబ్ శెట్టి ఈ ప్రాజెక్ట్ కోసం తన లుక్, ఫిజిక్‌లో పెద్ద మార్పులు చేసుకుని పాత్రలో పూర్తిగా లీనమయ్యారని సమాచారం. త్వరలోనే ట్రైలర్ విడుదల కానుంది. ఆ తర్వాతే గ్లోబల్ రిలీజ్ ప్లాన్స్‌పై అధికారిక క్లారిటీ రానుంది. మరి, “కాంతార చాప్టర్–1” మరోసారి అదే మాయను సృష్టించి ప్రపంచవ్యాప్తంగా హంగామా చేస్తుందా? లేక స్థానిక స్థాయిలోనే పరిమితం అవుతుందా? అన్నది చూడాలి..









