ప్రశాంత్ నీల్ – ఎన్టీఆర్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌పై ఇప్పటివరకు వచ్చిన అప్‌డేట్స్‌కి అదనంగా, ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. ఇందులో ఒక స్పెషల్ రోల్ ఉండబోతోందని, ఆ కీలక పాత్రలో కన్నడ హీరో రిషబ్ శెట్టి కనిపించనున్నారని సమాచారం. ఫ్లాష్‌బ్యాక్ సీక్వెన్స్‌లో ఆయన ఎంట్రీ ఉంటుందని టాక్..
ప్రశాంత్ నీల్ ఇప్పటివరకు చేసిన సినిమాలతో పోలిస్తే, ఈసారి రాసిన స్క్రిప్ట్ మరింత పవర్‌ఫుల్‌గా ఉందని చెప్పుకుంటున్నారు. అందుకే ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈ సినిమాపై భారీ హోప్స్ పెట్టుకున్నారు. టైటిల్ విషయంలో ‘డ్రాగన్’ అనే పేరు గట్టిగా ప్రచారంలో ఉంది. ఎన్టీఆర్ కెరీర్‌లోనే బెస్ట్ మూవీగా నిలిచేలా తీర్చిదిద్దాలని ప్రశాంత్ నీల్ ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నాడట.
మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ కలిసి ఈ సినిమాను నిర్మిస్తుండగా, మ్యూజిక్ డిపార్ట్‌మెంట్ బాధ్యతలను రవి బస్రూర్ తీసుకున్నారు. ఇకపోతే, ఒక స్పెషల్ యాక్షన్ సీక్వెన్స్ కోసం రామోజీ ఫిల్మ్ సిటీలో భారీ సెట్ కూడా నిర్మిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది..









