మెగా సుప్రీమ్ హీరో సాయి దుర్గతేజ్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న ప్రతిష్టాత్మక పాన్-ఇండియా చిత్రం ‘సంబరాల ఏటి గట్టు’ . దర్శకుడు రోహిత్ కేపీ క్రియేటివ్ విజన్‌లో, నిర్మాతలు కె. నిరంజన్ రెడ్డి మరియు చైతన్య రెడ్డి భారీ స్థాయిలో ఈ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నారు. దాదాపు ₹125 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా, సాయి దుర్గతేజ్ కెరీర్‌లోనే అతిపెద్ద చిత్రంగా నిలవనుంది.
ప్రస్తుతం సినిమా కీలకమైన షెడ్యూల్‌లో షూటింగ్ జరుపుకుంటోంది. ప్రముఖ యాక్షన్ మాస్టర్ పీటర్ హెయిన్ పర్యవేక్షణలో పవర్‌ఫుల్ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఇందులో సాయి దుర్గతేజ్‌తో పాటు ఒక బాలీవుడ్ టాప్ స్టార్ పాల్గొనడం సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేస్తోంది. ఈ హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ కోసం, అలాగే భావోద్వేగభరితమైన పాత్ర కోసం, సాయి దుర్గతేజ్ గత రెండేళ్లుగా కఠిన శిక్షణ పొందారు.
ఫిజికల్, ఎమోషనల్ మేకోవర్‌తో పాటు భారీ స్థాయిలో సీజీఐ వర్క్ కూడా జరుగుతోంది. ఈ చిత్రంలో ఐశ్వర్య లక్ష్మి, జగపతి బాబు, శ్రీకాంత్, సాయికుమార్, అనన్య నాగళ్ల, రవి కృష్ణ వంటి ప్రముఖ నటులు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.
‘హను-మాన్’ విజయంతో మరింత బలపడిన ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ ఈ ప్రాజెక్ట్‌ను తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్‌గా విడుదల చేయనుంది. తొలుత దసరా రిలీజ్గా ప్లాన్ చేసినప్పటికీ, పరిశ్రమ సమ్మె కారణంగా వాయిదా పడింది. త్వరలోనే చిత్రబృందం కొత్త రిలీజ్ డేట్ ప్రకటించనుంది.
‘సంబరాల ఏటి గట్టు (SYG)’ పాన్-ఇండియా స్థాయిలో కొత్త బెంచ్‌మార్క్ సెట్ చేస్తుందనే నమ్మకం చిత్రబృందం వ్యక్తం చేస్తోంది..









