Search
Close this search box.

  స్పిరిట్ రిలీజ్‌పై షాకింగ్ రూమర్స్..! ప్రభాస్ ఫ్యాన్స్‌లో టెన్షన్..!

May 8, 2026 10:17 PM | Aditya369 News

స్పిరిట్ రిలీజ్‌పై షాకింగ్ రూమర్స్..! ప్రభాస్ ఫ్యాన్స్‌లో టెన్షన్..!

టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ – సంచలన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘స్పిరిట్’ మూవీపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. అనౌన్స్‌మెంట్ వచ్చిన రోజు నుంచే ఈ సినిమా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉంది. పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో ప్రభాస్ కనిపించబోతుండటంతో ఫ్యాన్స్‌లో హైప్ మరో లెవెల్‌కి చేరింది. అయితే ఇప్పుడు ఈ సినిమా షూటింగ్, రిలీజ్ డేట్‌పై వస్తున్న వార్తలు అభిమానుల్లో కొత్త టెన్షన్ మొదలుపెట్టాయి.

ప్రస్తుతం చిత్ర యూనిట్ ఈ సినిమాను 2027 మార్చి 5న ప్రపంచవ్యాప్తంగా 8 భాషల్లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తోంది. నిర్మాత భూషణ్ కుమార్‌తో పాటు దర్శకుడు సందీప్ వంగా టీమ్ కూడా ఇదే టార్గెట్‌తో ముందుకెళ్తున్నట్లు సమాచారం. కానీ సోషల్ మీడియాలో మాత్రం పరిస్థితి వేరేలా కనిపిస్తోంది. షూటింగ్ అనుకున్న వేగంతో సాగడం లేదని.. సినిమా వాయిదా పడే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం గట్టిగా వినిపిస్తోంది. దీంతో డార్లింగ్ ఫ్యాన్స్ ఒక్కసారిగా ఆందోళన చెందుతున్నారు.

ఇక ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న ప్రాజెక్ట్స్ చూసినా ఈ డౌట్స్ రావడం సహజమే. ఒకవైపు ‘ఫౌజీ’, మరోవైపు ‘కల్కి 2’ వంటి భారీ సినిమాలతో ప్రభాస్ ఫుల్ బిజీగా ఉన్నారు. ఈ మధ్యలో ‘స్పిరిట్’ కోసం డేట్స్ కేటాయించడం అంత ఈజీ కాదు. పైగా సందీప్ రెడ్డి వంగా సినిమాలంటే క్వాలిటీకి ఎలాంటి రాజీ ఉండదు. ప్రతి సీన్ పర్ఫెక్ట్‌గా రావాలనే పట్టుదలతో పనిచేసే వంగా.. అవుట్‌పుట్ విషయంలో ఎంత టైమ్ అయినా తీసుకుంటారు. దీంతో ఈ భారీ ప్రాజెక్ట్ నిజంగా అనుకున్న సమయానికి పూర్తవుతుందా? అన్న అనుమానాలు అభిమానుల్లో పెరుగుతున్నాయి.

ఇక ఈ సినిమాలో ప్రభాస్ సరసన ‘యానిమల్’ ఫేమ్ త్రిప్తి దిమ్రి హీరోయిన్‌గా నటిస్తుండగా.. వివేక్ ఒబెరాయ్, ఐశ్వర్య దేశాయ్ వంటి నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. భారీ బడ్జెట్‌తో భద్రకాళి పిక్చర్స్, టీ-సిరీస్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. సాధారణ పాన్ ఇండియా మూవీగా కాకుండా.. పాన్ వరల్డ్ లెవెల్‌లో ఈ సినిమాను తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

అయితే ప్రస్తుతం అందరి దృష్టి ఒక్క విషయంపైనే ఉంది. సోషల్ మీడియాలో వస్తున్న వాయిదా వార్తలపై మూవీ టీమ్ ఎప్పుడు క్లారిటీ ఇస్తుందనేదే ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. సందీప్ వంగా లేదా మేకర్స్ అధికారిక ప్రకటన ఇస్తేనే అభిమానులకు పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అప్పటివరకు మాత్రం ‘స్పిరిట్’ షూటింగ్ అప్‌డేట్స్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూడాల్సిందే.

ఏమైనా సరే.. ప్రభాస్ – సందీప్ వంగా కాంబినేషన్ నుంచి వచ్చే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించడం మాత్రం ఖాయమనే నమ్మకం సినీ అభిమానుల్లో బలంగా ఉంది. ఆలస్యమైనా పరవాలేదు.. కానీ థియేటర్లలో ఓ బ్లాక్‌బస్టర్ ఎక్స్‌పీరియెన్స్ కావాలనేదే అందరి కోరిక. మరి 2027 మార్చి 5న ప్రభాస్ పోలీస్ యూనిఫామ్‌లో థియేటర్లలో ఎంట్రీ ఇస్తారా లేదా అన్నది చూడాలి.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు