Search
Close this search box.

  ‘వారణాసి’లో హాలీవుడ్ రేంజ్ అండర్ వాటర్ ఫైట్.. రాజమౌళి మాస్టర్ ప్లాన్..!

May 13, 2026 8:59 PM | Aditya369 News

‘వారణాసి’లో హాలీవుడ్ రేంజ్ అండర్ వాటర్ ఫైట్.. రాజమౌళి మాస్టర్ ప్లాన్..!

సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘వారణాసి’ కోసం ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులు ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమా అనౌన్స్ అయిన నాటి నుంచే ఇది ఇండియన్ సినిమా హిస్టరీలోనే హయ్యెస్ట్ గ్రాసర్ అవుతుందని ఘట్టమనేని అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇక ఇప్పుడు ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

వారణాసిలో హాలీవుడ్ స్టైల్ యాక్షన్ సీన్స్

తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమాలో హాలీవుడ్ రేంజ్‌లో భారీ యాక్షన్ ఎపిసోడ్స్ ఉండబోతున్నాయట. ముఖ్యంగా ఒక అండర్ వాటర్ ఫైట్ సీక్వెన్స్ కోసం హైదరాబాద్‌లోని గగన్‌పహాడ్ ప్రాంతంలో ప్రత్యేకంగా ఓ ఆర్టిఫిషియల్ వాటర్ పాండ్‌ను మేకర్స్ సిద్ధం చేశారట. అయితే ఆ పాండ్ నింపడానికి సుమారు 150 ట్యాంకర్ల నీరు అవసరమవడంతో, వాటర్ బోర్డుకు కూడా అప్లై చేసినట్టు తెలుస్తోంది.

సాధారణంగా మహేశ్ బాబు – రాజమౌళి సినిమా కాబట్టి అనుమతులు ఈజీగా వస్తాయని అందరూ భావించారు. కానీ అక్కడే ట్విస్ట్ ఎదురైంది. ప్రస్తుతం ఎండాకాలం కారణంగా నగరంలో నీటి కొరత తీవ్రంగా ఉందని, ఈ సమయంలో అంత పెద్ద మొత్తంలో నీరు ఇవ్వడం సాధ్యం కాదని జలమండలి అధికారులు స్పష్టం చేశారట. దీంతో జక్కన్న టీమ్‌కు ఇది ఊహించని షాక్‌గా మారిందని టాక్ వినిపిస్తోంది.

షూటింగ్ లొకేషన్ మార్పు

ఇక హైదరాబాద్‌లో వాటర్ సమస్య రావడంతో మేకర్స్ తమ ప్లాన్‌ను పూర్తిగా మార్చేశారట. ఈ అండర్ వాటర్ యాక్షన్ సీక్వెన్స్‌ను నేరుగా వారణాసిలోనే తెరకెక్కించాలని ఫైనల్ చేసినట్టు సమాచారం. గంగానది పరిసరాల్లో ఉన్న న్యాచురల్ లొకేషన్లలో షూట్ చేస్తే విజువల్స్ మరింత గ్రాండ్‌గా కనిపిస్తాయని రాజమౌళి భావిస్తున్నాడట.

ఇక ఈ చిత్రంలో మహేశ్ బాబుకు జోడీగా గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటిస్తుండగా, మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక విలన్ పాత్రలో కనిపించనున్నాడు. ఈ కాంబినేషన్‌ను సిల్వర్ స్క్రీన్‌పై చూడాలని అభిమానులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నారు.

ముఖ్యంగా ‘RRR’తో ఆస్కార్ వేదికపై సంచలనం సృష్టించిన రాజమౌళి, ఇప్పుడు ‘వారణాసి’తో మరోసారి ప్రపంచ స్థాయిలో మ్యాజిక్ చేయబోతున్నాడనే అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ సినిమాను 2027 ఏప్రిల్ 7న సమ్మర్ కానుకగా వరల్డ్‌వైడ్‌గా రిలీజ్ చేయనున్నట్లు మూవీ టీమ్ అధికారికంగా ప్రకటించింది.

3000 కోట్ల టార్గెట్?

సినిమాలో మహేశ్ బాబు ‘రుద్ర’ అనే పవర్‌ఫుల్ పాత్రలో కనిపించనున్నాడని, ప్రియాంక చోప్రా ‘మందాకిని’ పాత్రలో నటిస్తోందని టాక్. అలాగే పృథ్వీరాజ్ ‘కుంభ’ అనే భయంకరమైన విలన్‌గా కనిపించనున్నాడట.

ఇక ఇండియన్ బాక్సాఫీస్ వద్ద 3000 కోట్ల టార్గెట్‌తో బరిలోకి దిగుతున్న రాజమౌళి, నిజంగానే ఆ రేంజ్ హిట్ అందుకుంటాడా లేదా అన్నది మాత్రం 2027 ఏప్రిల్ 7న తేలనుంది.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు