ఆగస్టు 22… మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు. ఈ రోజు కోసం అభిమానులు ఏడాది మొత్తం ఎదురుచూస్తుంటారు. రక్తదాన శిబిరాలు, కేక్ కటింగ్స్, భారీ బ్యానర్లు, సేవా కార్యక్రమాలతో తెలుగు రాష్ట్రాల్లో మెగా అభిమానుల సందడి ఓ రేంజ్‌లో ఉంటుంది.
అయితే ఈసారి ఫ్యాన్స్ సెలబ్రేషన్స్‌ను మరింత స్పెషల్ చేయడానికి నిర్మాతలు కూడా భారీ సర్ప్రైజ్‌లను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే ‘విశ్వంభర’ సినిమా నుంచి ఆగస్టు 22న ఏదో ఒక క్రేజీ అప్‌డేట్ రావడం దాదాపు ఖాయమనే ప్రచారం జరుగుతుండగా.. ఇప్పుడు మరో మెగా ప్రాజెక్ట్ కూడా అదే రోజు అభిమానులను అలరించబోతోందనే సంకేతాలు వచ్చాయి.
థమన్ ట్వీట్‌తో మొదలైన హైప్
మెగాస్టార్ – దర్శకుడు బాబీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న Mega158 సినిమాకు సంగీతం అందిస్తున్న థమన్ తాజాగా చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
అంటూ థమన్ చేసిన ట్వీట్‌తో మెగా అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. దీంతో ఆగస్టు 22న ఈ సినిమా నుంచి గ్లింప్స్ వస్తుందా? టైటిల్ రివీల్ చేస్తారా? లేక మరేదైనా స్పెషల్ అనౌన్స్‌మెంట్ ఉంటుందా? అనే చర్చ మొదలైంది.
జెట్ స్పీడ్‌లో షూటింగ్
దర్శకుడు బాబీ తెరకెక్కిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ షూటింగ్ ప్రస్తుతం వేగంగా కొనసాగుతోంది. ఇటీవల పొల్లాచ్చిలో కీలక షెడ్యూల్ పూర్తి చేసుకున్న చిత్రబృందం ప్రస్తుతం హైదరాబాద్‌లో తదుపరి షెడ్యూల్‌కు సిద్ధమవుతోంది.
ఈ చిత్రాన్ని 2027 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే లక్ష్యంతో మేకర్స్ పనులను వేగవంతం చేస్తున్నారు.
స్ట్రాంగ్ సపోర్టింగ్ క్యాస్ట్
ఈ సినిమాలో నటి నివేదా పేతురాజ్ కీలక పాత్రలో కనిపించనుండగా.. యువ నటి అనశ్వర రాజన్ మెగాస్టార్ చిరంజీవి కుమార్తె పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం.
మొత్తానికి ఈసారి మెగాస్టార్ పుట్టినరోజు సందర్భంగా ‘విశ్వంభర’తో పాటు Mega158 నుంచి కూడా వరుస అప్‌డేట్లు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవేళ అదే జరిగితే.. ఆగస్టు 22 మెగా అభిమానులకు నిజంగానే డబుల్ ధమాకాగా మారడం ఖాయం.








