ఆంధ్రప్రదేశ్ పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాల విడుదలకు సర్వం సిద్ధమైంది.ఈ రోజు గురువారం (ఏప్రిల్ 30) ఉదయం 11 గంటలకు విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఎక్స్ వేదికగా ఫలితాలను విడుదల చేయనున్నారు.ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ అధికారిక ప్రకటన వెలువరించింది. ఫలితాలు విడుదలైన తర్వాత అధికారిక వెబ్‌సైట్, మనమిత్ర వాట్సప్, లీప్ యాప్ ద్వారా పదో తరగతి ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.విద్యార్ధులు తమ హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేసి ఫలితాలను పొందొచ్చు.









