తెలుగు సినిమా మాత్రమే కాదు… ఇప్పుడు ఇండియన్ బాక్సాఫీస్‌ను ఏలుతున్న వన్ అండ్ ఓన్లీ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్. ‘బాహుబలి’తో రాజమౌళి చేతిలో పడిన తర్వాత డార్లింగ్ కెరీర్ పూర్తిగా మారిపోయింది. అప్పటి నుంచి వరుస పాన్ ఇండియా చిత్రాలతో బాక్సాఫీస్‌ను షేక్ చేస్తూ గ్లోబల్ స్టార్‌గా ఎదిగాడు.
ఇప్పుడు అదే జోరును కొనసాగిస్తూ ‘స్పిరిట్’, ‘ఫౌజీ’, ‘కల్కి 2’ వంటి భారీ ప్రాజెక్టులతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. అయితే వీటిలో ముఖ్యంగా ‘కల్కి 2898 AD’ సీక్వెల్‌పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. ఇప్పటికే మొదటి భాగంలో సుమతి పాత్రలో నటించిన దీపికా పదుకొణె సీక్వెల్లో కొనసాగడం లేదనే వార్తలు రావడంతో, ఆమె స్థానంలో ఎవరు నటిస్తారనే చర్చ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
సాయి పల్లవి కాదు… ఇప్పుడు ఆలియా భట్ పేరు!
కొద్ది రోజుల క్రితం వరకు సుమతి పాత్ర కోసం సాయి పల్లవిని ఫైనల్ చేశారంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరిగింది. అధికారిక ప్రకటన మాత్రమే మిగిలిందని కూడా వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు తాజా పరిణామాలు చూస్తుంటే ఆ వార్తల్లో నిజం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
దానికి కారణం… ప్రభాస్ తాజాగా బాలీవుడ్ స్టార్ ఆలియా భట్‌కు ఇచ్చిన సపోర్ట్.
ఆలియా భట్, శర్వరీ వాఘ్ ప్రధాన పాత్రల్లో నటించిన YRF స్పై యూనివర్స్ చిత్రం ‘ఆల్ఫా’ ట్రైలర్‌ను తన సోషల్ మీడియాలో షేర్ చేసిన ప్రభాస్… “ఆల్ఫా ట్రైలర్ అద్భుతంగా ఉంది. ఆలియా భట్‌తో పాటు మొత్తం YRF టీమ్‌కు నా బెస్ట్ విషెస్” అంటూ ప్రత్యేకంగా అభినందించాడు.
దీనికి స్పందించిన ఆలియా భట్… “థాంక్యూ… థాంక్యూ సో మచ్ ప్రభాస్” అంటూ ఆయన స్టోరీని రీషేర్ చేయడం మరింత ఆసక్తిని పెంచింది.
ప్రభాస్ పోస్ట్ వెనుక అసలు కథ ఇదేనా?
సాధారణంగా ప్రభాస్ ఇతర భాషల సినిమాల ప్రమోషన్స్‌కు ఇలా సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం చాలా అరుదు. అలాంటిది ఆలియా భట్ సినిమా ట్రైలర్‌ను ప్రత్యేకంగా షేర్ చేయడంతో నెటిజన్లు కొత్త లెక్కలు వేయడం మొదలుపెట్టారు.
‘కల్కి 2’లో దీపికా పదుకొణె స్థానంలో ఆలియా భట్ కనిపించబోతుందా? అందుకే ప్రభాస్ ముందుగానే ఆమెకు సపోర్ట్ చేస్తున్నాడా? అంటూ సోషల్ మీడియాలో రకరకాల చర్చలు సాగుతున్నాయి.
అయితే గతంలో కూడా ఆలియా భట్ ‘కల్కి 2’లో నటిస్తుందనే వార్తలను చిత్రబృందం ఖండించింది. అయినప్పటికీ తాజా పరిణామాలతో మరోసారి అదే ప్రచారం ఊపందుకుంది. దీపికా స్థానాన్ని భర్తీ చేయగల స్టార్ ఇమేజ్ ఆలియాకే ఉందని, అందుకే దర్శకుడు నాగ్ అశ్విన్ ఆమెను సంప్రదించాడనే టాక్ కూడా వినిపిస్తోంది.
అయితే ఇవన్నీ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఊహాగానాలు మాత్రమే. దీనిపై ప్రభాస్ టీమ్ కానీ, వైజయంతి మూవీస్ కానీ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
మరి ఈ ప్రచారానికి త్వరలో తెరపడుతుందా? నిజంగానే ఆలియా భట్ ‘కల్కి 2’లో కనిపించబోతుందా? లేక మరో స్టార్ హీరోయిన్ ఎంట్రీ ఇవ్వబోతుందా? అనేది తెలియాలంటే మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.









