Search
Close this search box.

  రజినీ కాంత్, శంకర్ సెన్సేషన్ రోబో రీ రిలీజ్..? ఎప్పుడంటే..?

June 30, 2026 10:04 PM | Aditya369 News

రజినీ కాంత్, శంకర్ సెన్సేషన్ రోబో రీ రిలీజ్..? ఎప్పుడంటే..?

భారతీయ సినిమా చరిత్రలో విజువల్ వండర్‌గా నిలిచిపోయిన చిత్రాల్లో సూపర్ స్టార్ రజనీకాంత్, దర్శకుడు శంకర్ కాంబినేషన్‌లో వచ్చిన ‘రోబో’ ఒకటి. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం అప్పట్లో బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు చేయడమే కాకుండా, పాన్ ఇండియా స్థాయిలో కొత్త రికార్డులను సృష్టించింది. ముఖ్యంగా భారీ తెరపై ఈ సినిమా అందించిన విజువల్ ఎక్స్‌పీరియన్స్‌ను ప్రేక్షకులు ఇప్పటికీ మర్చిపోలేదు.

తెలుగులోనూ అద్భుతమైన వసూళ్లు సాధించిన ఈ సినిమాను మరోసారి థియేటర్లలో చూడాలని అభిమానులు చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. ఒకసారి చూసిన వారు ఆ మ్యాజిక్‌ను మళ్లీ ఆస్వాదించాలని కోరుకుంటుండగా, థియేటర్లలో మిస్ అయిన వారు ఈసారి బిగ్ స్క్రీన్‌పై చూడాలని ఆసక్తిగా ఉన్నారు.

ఇప్పుడు వారి ఎదురుచూపులకు తెరపడే అవకాశం కనిపిస్తోంది. ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం, ‘రోబో’ రీ-రిలీజ్‌కు సన్నాహాలు జరుగుతున్నాయట. ప్రస్తుతం తెలుగు వెర్షన్ విడుదలపై మాత్రమే చర్చలు జరుగుతున్నట్లు టాక్ వినిపిస్తోంది.

అయితే ‘బాహుబలి: ది ఎపిక్’ తరహాలో పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని రీ-రిలీజ్ చేస్తే మరింత భారీ స్పందన వచ్చే అవకాశముందని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. దీనిపై అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

కాగా, ఈ చిత్రానికి ఆస్కార్ విజేత ఏ.ఆర్. రెహమాన్ సంగీతం అందించగా, కళానిధి మారన్ నిర్మించారు. మరి ఈ విజువల్ బ్లాక్‌బస్టర్ మరోసారి బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ చేస్తుందో లేదో చూడాలి.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు