Search
Close this search box.

  ‘పెద్ది’ నుంచి డబుల్ ధమాకా.. ముంబైలో ట్రైలర్, భోపాల్‌లో రెహమాన్ లైవ్ షో..?

May 13, 2026 9:07 PM | Aditya369 News

‘పెద్ది’ నుంచి డబుల్ ధమాకా.. ముంబైలో ట్రైలర్, భోపాల్‌లో రెహమాన్ లైవ్ షో..?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, ‘ఉప్పెన’ దర్శకుడు బూచి బాబు తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా మూవీ ‘పెద్ది’పై రోజురోజుకీ అంచనాలు పెరుగుతున్నాయి. అనౌన్స్‌మెంట్ నుంచే సినీ అభిమానుల్లో భారీ హైప్ క్రియేట్ చేసిన ఈ చిత్రం.. ఇప్పుడు వరుస అప్‌డేట్స్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ముఖ్యంగా రామ్ చరణ్ పూర్తిస్థాయి మాస్ అవతారంలో కనిపించనున్నాడన్న వార్తతో మెగా ఫ్యాన్స్ ఫుల్ జోష్‌లో ఉన్నారు.

ముంబైలో గ్రాండ్ ట్రైలర్ లాంచ్

ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ డేట్‌ను ప్రకటించిన మేకర్స్.. తాజాగా ట్రైలర్ ఈవెంట్ జరిగే వేదికను కూడా రివీల్ చేశారు. మే 18, 2026న దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ‘పెద్ది’ అఫీషియల్ ట్రైలర్‌ను గ్రాండ్‌గా విడుదల చేయబోతున్నారు. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించింది.

‘ఆర్ఆర్ఆర్’ తర్వాత నార్త్ ఇండియాలో రామ్ చరణ్‌కు వచ్చిన క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని.. పాన్ ఇండియా ప్రమోషన్స్‌ను భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. అందుకే ట్రైలర్ లాంచ్‌ను ముంబైలో నిర్వహించనున్నట్టు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

ఏఆర్ రెహమాన్ లైవ్ షోతో సర్ప్రైజ్

ట్రైలర్ అప్‌డేట్ ఇచ్చిన వెంటనే అభిమానులకు మరో బిగ్ సర్ప్రైజ్ కూడా ఇచ్చింది మూవీ టీమ్. ఈ చిత్రానికి ఆస్కార్ విజేత A. R. రెహమాన్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. సినిమాలోని ఓ స్పెషల్ సాంగ్‌ను మే 23న మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో భారీ ఈవెంట్ ద్వారా రిలీజ్ చేయబోతున్నారు.

ఈ కార్యక్రమంలో స్వయంగా ఏఆర్ రెహమాన్ లైవ్ పర్ఫార్మెన్స్ ఇవ్వబోతుండటం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. “Sound Of Peddi will echo in Bhopal” అంటూ మేకర్స్ చేసిన అనౌన్స్‌మెంట్‌తో మెగా ఫ్యాన్స్‌తో పాటు మ్యూజిక్ లవర్స్ కూడా ఈ ఈవెంట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

జూన్ 4న థియేటర్లలో సందడి

ఇక అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ‘పెద్ది’ జూన్ 4, 2026న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. బుచ్చిబాబు సనా ఎమోషనల్ స్టోరీటెల్లింగ్, రామ్ చరణ్ పవర్‌ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్, ఏఆర్ రెహమాన్ మ్యూజిక్.. ఇవన్నీ కలిసి ఈ సినిమాను బాక్సాఫీస్ వద్ద భారీ రికార్డులు సృష్టించేలా చేస్తాయని సినీ వర్గాలు భావిస్తున్నాయి.

మే 18 నుంచి మొదలయ్యే ఈ ప్రమోషనల్ జాతర.. రిలీజ్ వరకు ఏ స్థాయి హంగామా సృష్టిస్తుందో చూడాలి.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు