కరప మండలం వేలంగి గ్రామంలో జన సేవాదళ్ స్వచ్ఛంద సంస్థ ఒక కుటుంబానికి మంగళవారం ఆర్థిక సాయం అందించినట్టు సేవాదళ్ ఉపాధ్యక్షుడు నక్కఅంజిబాబు తెలిపారు.వేళంగి గ్రామానికి చెందిన పి ప్రతాప్ ఇటీవల మృతి చెందాడు.దాంతో ఆ కుటుంబానికి ఆసరాగా నిలవాలనే ఉద్దేశ్యంతో మృతుడి భార్య పుల్లాదేవికు రూ13 వేలు అందజేశారు.ఈ కార్యక్రమంలో కరప మార్కెట్ కమిటీ చైర్మన్ ముద్రగడ రమేష్,సొసైటీ అధ్యక్షులు సైనవరపు భవాని శంకర్, మీసాల రాంబాబు,పి తణుకులరాజు పాల్గొన్నారు.









