Search
Close this search box.

  ‘వారణాసి’ సెట్స్ లీక్.. రాజమౌళి ప్లాన్ చూసి షాక్ అవుతున్న ఫ్యాన్స్..!

May 28, 2026 5:18 PM | Aditya369 News

‘వారణాసి’ సెట్స్ లీక్.. రాజమౌళి ప్లాన్ చూసి షాక్ అవుతున్న ఫ్యాన్స్..!

దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక పాన్ వరల్డ్ మూవీ ‘వారణాసి’ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా కొనసాగుతోంది. ఈ క్రమంలో తాజాగా ఈ సినిమా సెట్స్‌కు సంబంధించిన ఓ లీక్ ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారి అభిమానుల్లో భారీ ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇప్పటికే మహేష్ బాబు, ప్రియాంక చోప్రాల క్యారెక్టర్ పోస్టర్లు మరియు టీజర్‌లో కనిపించిన “ఉగ్రభట్టి గుహలు” సీక్వెన్స్‌పై అంచనాలు తారాస్థాయికి చేరుకోగా.. ఇప్పుడు బయటకు వచ్చిన ఈ ఫోటో ఆ హైప్‌ను మరింత పెంచేసింది.

వైరల్ అవుతున్న ఈ సెట్ ఫోటోలో భారీ రాతి నిర్మాణాలు, పురాతన గుహలను తలపించే స్తంభాలు, చుట్టూ అమర్చిన బ్లూ స్క్రీన్‌లు కనిపిస్తున్నాయి. ఈ ఒక్క ఫోటో చూస్తేనే రాజమౌళి ఈ సీన్‌ను ఎంత గ్రాండ్‌గా తెరకెక్కిస్తున్నారో అర్థమవుతోంది. ముఖ్యంగా ఈ “ఉగ్రభట్టి గుహలు” సీక్వెన్స్ సినిమాలోనే అతిపెద్ద హైలైట్‌గా నిలవనుందని సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తోంది.

ఇక కథలో భాగంగా మహేష్ బాబు ఓ పురాతన కళాఖండాల కోసం చేసే అన్వేషణలో ఈ గుహల్లోకి ప్రవేశిస్తాడట. అక్కడ అతడు ఒక భయంకరమైన దుష్టశక్తిని ఎదుర్కొనే పరిస్థితి వస్తుందని, దానిని జయించేందుకు ‘మాతా ఛిన్నమస్తా దేవి’ దైవిక శక్తిని ఆశ్రయిస్తాడని ప్రచారం జరుగుతోంది. టీజర్‌లో కూడా దేవి తన తలను చేతిలో పట్టుకుని, రక్తాన్ని తన అనుచరులకు ప్రసాదిస్తున్న భయానక రూపాన్ని చూపించడం ప్రేక్షకుల్లో థ్రిల్ క్రియేట్ చేసింది.

ప్రస్తుతం లీకైన ఈ ఫోటోలో నటీనటులు కనిపించకపోయినా.. సెట్స్ డిజైన్, బ్లూ స్క్రీన్ సెటప్ చూస్తే ఈ సీక్వెన్స్ కోసం భారీ స్థాయిలో VFX వర్క్ జరుగుతోందని స్పష్టంగా తెలుస్తోంది. రాజమౌళి విజువల్ గ్రాండ్‌నెస్ కోసం ఎంత కష్టపడుతున్నారో ఈ ఫోటో మరోసారి నిరూపిస్తోంది.

ఇక ఇప్పటికే ఈ సినిమా కోసం రాజమౌళి ఆఫ్రికా అడవుల్లో జంతువుల లైవ్ ఫుటేజ్ షూట్ చేసినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అంతేకాదు, 25 నిమిషాల నిడివి గల రామాయణ యుద్ధ సన్నివేశాన్ని IMAX కెమెరాలతో చిత్రీకరిస్తున్నట్లు కూడా సమాచారం. ప్రస్తుతం బయటకు వస్తున్న ప్రతి అప్‌డేట్‌తో ‘వారణాసి’పై అంచనాలు మరింత పెరుగుతుండగా.. మహేష్ బాబు అభిమానులు ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore