కాకినాడ రూరల్ నియోజకవర్గంలో డీజిల్ అందుబాటులో లేదన్న వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి కురసాల కన్నబాబు ఆరోపణలను కూటమి నాయకులు తీవ్రంగా ఖండించారు.స్థానిక చంద్రన్న సమావేశ మందిరంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ, ఈ ఆరోపణలు పూర్తిగా అసత్యమని స్పష్టం చేశారు.రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సహకారంతో ఎమ్మెల్యే పంతం నానాజీ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా అమలు చేస్తున్న నేపథ్యంలో, వాటిని చూసి ఓర్వలేకే కన్నబాబు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు.రైతులు డీజిల్ కొరతతో ఇబ్బందులు పడుతున్నారని తెలిసిన వెంటనే ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లగా, ఈ నెల 27వ తేదీ నుంచి పంట కోత యంత్రాలకు డీజిల్ అందుబాటులో ఉండేలా తక్షణ చర్యలు చేపట్టినట్లు తెలిపారు.గత మూడు రోజులుగా 161 వరి కోత యంత్రాలకు 358 కూపన్ల ద్వారా, ఒక్కో కూపన్‌కు 70 లీటర్ల చొప్పున మొత్తం 25,060 లీటర్ల డీజిల్ సరఫరా చేసినట్లు అధికారుల నివేదిక ద్వారా వివరించారు. ఈ సరఫరా వల్ల ఎటువంటి అంతరాయం లేకుండా సుమారు 5,430 ఎకరాల్లో వరి కోత పనులు విజయవంతంగా పూర్తయ్యాయని తెలిపారు.జనసేన సీనియర్ నాయకుడు భోగి రెడ్డి కొండబాబు మాట్లాడుతూ, ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఆరోపణలు చేస్తున్న కన్నబాబు గ్రామాల్లోకి వచ్చి రైతులను నేరుగా అడిగి వాస్తవాలు తెలుసుకోవాలన్నారు.ఈ సమావేశంలో జనసేన పార్టీ అధ్యక్షుడు బండారు మురళి, ముద్రగడ రమేష్, పుణ్యమంతుల గంగ సత్యనారాయణ, దూడల నారాయుడు, మెండు గోవింద్, సైనవరాపు భవాని శంకర్, యాళ్ల పండు, గొల్లపల్లి శేఖర్, జోకా తాతాజీ, గంట వీరన్న చౌదరి తదితరులు పాల్గొన్నారు.








