ఓటీటీ ప్రేక్షకులకు ఈ వారం అసలైన ఎంటర్టైన్మెంట్ జాతర మొదలుకానుంది. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, జియోహాట్‌స్టార్ వంటి ప్రముఖ ప్లాట్‌ఫామ్‌లు వరుసగా కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాయి. యాక్షన్ నుంచి సై-ఫై వరకు, థ్రిల్లర్ నుంచి కామెడీ వరకు దాదాపు 15కిపైగా కొత్త కంటెంట్ ఈ వారం స్ట్రీమింగ్కు రానుండటంతో మూవీ లవర్స్‌లో ఆసక్తి నెలకొంది.
ఈ వారంలో అత్యంత హైప్ క్రియేట్ చేస్తున్న చిత్రం రణవీర్ సింగ్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ ‘ధురంధర్: ది రివెంజ్’ అలియాస్ ‘ధురంధర్ 2’. 2025లో విడుదలై మంచి స్పందన తెచ్చుకున్న ‘ధురంధర్’ సినిమాకు ఇది సీక్వెల్‌గా వస్తోంది. ఇందులో రణవీర్ సింగ్ మరోసారి జస్కిరత్ సింగ్ రంగి పాత్రలో కనిపించనుండగా, కరాచీలో హమ్జా అలీ మజారీగా అతని ఎదుగుదల చుట్టూ కథ సాగనుంది. భారీ యాక్షన్ ఎపిసోడ్స్, ఎమోషనల్ డ్రామాతో తెరకెక్కిన ఈ సినిమాలో అర్జున్ రాంపాల్, సంజయ్ దత్, ఆర్. మాధవన్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రం మే 15 నుంచి జియోహాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది.
ఇక నెట్‌ఫ్లిక్స్‌లో సైఫ్ అలీ ఖాన్ నటించిన ‘కర్తవ్య’ కూడా అదే రోజు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఓ జర్నలిస్ట్ హత్య కేసు దర్యాప్తులో కుటుంబ బాధ్యతలు, పోలీస్ విధి మధ్య ఇరుక్కుపోయే ఎస్హెచ్ఓ పాత్రలో సైఫ్ నటన ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. మరోవైపు నిజజీవిత సంఘటనల ఆధారంగా రూపొందిన ‘ఇన్స్పెక్టర్ అవినాష్’ సీజన్ 2 కూడా మే 15 నుంచే స్ట్రీమింగ్ కానుంది. యూపీ సూపర్ కాప్ అవినాష్ మిశ్రా కథతో తెరకెక్కిన ఈ సిరీస్‌లో రణదీప్ హుడా మరోసారి పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నారు.
అంతేకాదు, హాలీవుడ్ మూవీ లవర్స్ కోసం రైన్ గోస్లింగ్ నటించిన సైన్స్ ఫిక్షన్ డ్రామా ‘ప్రాజెక్ట్ హైల్ మేరీ’ అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల కానుండగా, ప్రముఖ కమెడియన్ జీవితం ఆధారంగా రూపొందిన ‘మార్టీ: లైఫ్ ఈజ్ షార్ట్’ డాక్యుమెంటరీ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.
ఇవే కాకుండా ‘కాలిదాస్ 2’, ‘తిమ్మరాజుపల్లి టీవీ’, ‘డెవిల్ మే క్రై: సీజన్ 2’ వంటి మరిన్ని సినిమాలు, వెబ్‌సిరీస్‌లు కూడా ఈ వారం ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. మొత్తంగా చూస్తే యాక్షన్, థ్రిల్లర్, కామెడీ, సై-ఫై, క్రైమ్ డ్రామా… ఇలా అన్ని జానర్లతో ఈ వారం ఓటీటీ ప్రేక్షకులకు పూర్తి వినోదం ఖాయంగా కనిపిస్తోంది.









