Search
Close this search box.

  ‘రామాయణ’ రిలీజ్ డేట్ ప్రిపోన్..?

May 23, 2026 2:06 PM | Aditya369 News

‘రామాయణ’ రిలీజ్ డేట్ ప్రిపోన్..?

ఈ మధ్యకాలంలో పెద్ద సినిమాలు అనౌన్స్ చేసిన రిలీజ్ డేట్‌కే రావడం గగనమైపోయింది. వాయిదాల మీద వాయిదాలు పడటం కామన్ అయిపోయింది. అలాంటిది ఓ భారీ సినిమా అనుకున్న తేదీ కంటే ముందే రిలీజ్‌కు రెడీ అవుతుందంటే అది నిజంగా షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి. ఇప్పుడు అదే పని చేయబోతుందట ఇండియన్ సినిమా హిస్టరీలోనే అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ‘రామాయణం’.

మొదట ఈ చిత్రాన్ని దీపావళి కానుకగా నవంబర్ 7న విడుదల చేయాలని ప్లాన్ చేశారు మేకర్స్. కానీ ఇప్పుడు ప్లాన్ మారిందని బాలీవుడ్ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది. తాజా సమాచారం ప్రకారం… నిర్మాత నమిత్ మల్హోత్రా ఈ సినిమాను వారం ముందుగానే, అంటే అక్టోబర్ 31న రిలీజ్ చేయాలని ఆలోచిస్తున్నారట.

సాధారణంగా ఇలాంటి భారీ సినిమాలకు ఓపెనింగ్స్ విషయంలో ఎలాంటి టెన్షన్ ఉండదు. రిలీజ్ అయిన మొదటి వారం కలెక్షన్స్ ఆటోమేటిక్‌గా వస్తాయి. కానీ ‘రామాయణం’ విషయంలో మేకర్స్ స్ట్రాటజీ మరింత ఇంట్రెస్టింగ్‌గా కనిపిస్తోంది. దీపావళికి వారం ముందు రిలీజ్ చేస్తే… మొదటి వారం భారీ వసూళ్లు రావడమే కాకుండా, తర్వాత వచ్చే ఫెస్టివల్ వీకెండ్‌లో కూడా మరోసారి బాక్సాఫీస్ ఊపు పెరుగుతుందని లెక్కలు వేస్తున్నారట.

అంటే ఫస్ట్ వీక్‌తో పాటు సెకండ్ వీక్ కూడా బ్లాస్ట్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నారన్న మాట. ముఖ్యంగా సినిమా మీద పాజిటివ్ టాక్ స్టార్ట్ అయితే… దీపావళి హాలిడేస్ ఆ సినిమాకి మరింత బూస్ట్ ఇస్తాయని నిర్మాత నమిత్ మల్హోత్రా నమ్ముతున్నారట. లాంగ్ రన్‌లో భారీ రికార్డులు టార్గెట్ చేయాలంటే ఇదే బెస్ట్ ప్లాన్ అని భావిస్తున్నారని సమాచారం.

నితీశ్ తివారి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మైథలాజికల్ విజువల్ వండర్‌లో రాముడిగా రణబీర్ కపూర్ నటిస్తుండగా… సీత పాత్రలో సాయిపల్లవి కనిపించనుంది. ఇక రావణుడిగా యశ్ నటిస్తుండటం సినిమాపై మరింత హైప్ పెంచుతోంది. అయితే ఫస్ట్ పార్ట్‌లో రావణుడి పాత్ర పూర్తి స్థాయిలో ఉండదట. రాముడి జననం నుంచి ఆయన అరణ్యవాసానికి వెళ్లే వరకు కథను చూపించనున్నారని టాక్.

ఇప్పటికే ఈ ప్రాజెక్ట్‌పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. మరి ఇప్పుడు రిలీజ్ డేట్ ప్రిపోన్ వార్తలతో… ‘రామాయణం’ హైప్ మరో లెవెల్‌కి వెళ్లిపోయింది.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore