Search
Close this search box.

  ప్రభాస్ ‘స్పిరిట్’లో స్పెషల్ సర్‌ప్రైజ్.. బాలీవుడ్ హీరోయిన్ ఎవరు..?

June 29, 2026 10:01 AM | Aditya369 News

ప్రభాస్ ‘స్పిరిట్’లో స్పెషల్ సర్‌ప్రైజ్.. బాలీవుడ్ హీరోయిన్ ఎవరు..?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ – స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ‘స్పిరిట్’ గురించి మరో క్రేజీ అప్‌డేట్ వైరల్‌గా మారింది.

ప్రస్తుతం ఈ సినిమా కొత్త షెడ్యూల్ కోసం భారీ సెట్‌ను నిర్మిస్తుండగా… ఈ షెడ్యూల్‌లోనే ఓ ప్రత్యేక పాటను చిత్రీకరించనున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

ఈ స్పెషల్ సాంగ్‌లో ప్రభాస్‌తో పాటు హీరోయిన్ త్రుప్తి దిమ్రి కనిపించనుండగా… మరో ప్రముఖ బాలీవుడ్ బ్యూటీ కూడా ఈ పాటలో సందడి చేయనున్నట్లు సమాచారం. ఈ సాంగ్‌ను భారీ స్థాయిలో, విజువల్‌గా ఎంతో గ్రాండ్‌గా ప్లాన్ చేస్తున్నారట.

ఇక ‘స్పిరిట్’ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతుండగా, ఇందులో యాక్షన్ ఎపిసోడ్స్ హాలీవుడ్ స్థాయిలో ఉండబోతున్నాయని టాక్. ఇప్పటికే విడుదలైన పోస్టర్ ప్రభాస్ అభిమానుల్లో భారీ హైప్‌ను క్రియేట్ చేసింది. ముఖ్యంగా ప్రభాస్ వైల్డ్ అండ్ మాస్ లుక్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇటీవల సంగీత దర్శకుడు హర్షవర్ధన్ రామేశ్వర్, దర్శకుడు సందీప్ రెడ్డి వంగాతో మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా పూర్తి చేసినట్లు సమాచారం. టి-సిరీస్, భద్రకాళి పిక్చర్స్ సంయుక్తంగా అత్యంత భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.

అత్యంత పవర్‌ఫుల్ పోలీస్ కథతో తెరకెక్కుతున్న ‘స్పిరిట్’ కథాంశం పూర్తిగా కొత్తగా ఉండబోతుందని, సందీప్ రెడ్డి వంగా మరోసారి తన ప్రత్యేకమైన మేకింగ్‌తో ప్రేక్షకులను ఆశ్చర్యపరచడానికి సిద్ధమవుతున్నారని సినీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో ఈ సినిమాపై అంచనాలు రోజురోజుకూ మరింత పెరుగుతున్నాయి.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు