Search
Close this search box.

  త్రివిక్రమ్-ఎన్టీఆర్ పోస్టర్‌పై తమిళ తంబీల ఫైర్..!

June 30, 2026 9:53 PM | Aditya369 News

త్రివిక్రమ్-ఎన్టీఆర్ పోస్టర్‌పై తమిళ తంబీల ఫైర్..!

ఎన్టీఆర్ – త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న కొత్త సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైన వెంటనే సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారి తీసింది. పోస్టర్‌తో పాటు నిర్మాత నాగ వంశీ చేసిన ఒక పోస్ట్ ఇప్పుడు వివాదానికి కేంద్ర బిందువుగా మారింది.

విషయంలోకి వెళ్తే… పోస్టర్‌ను బట్టి చూస్తే ఈ సినిమా సుబ్రహ్మణ్య స్వామి తత్వాన్ని ఆధారంగా చేసుకుని రూపొందుతున్నట్లు కనిపిస్తోంది. అయితే నిర్మాత నాగ వంశీ తన సోషల్ మీడియా ఖాతాలో "ఉత్తరాదిన జన్మించి, హృదయభూమిలో రూపుదిద్దుకుని, దక్షిణాదిన పూజలందుకుంటున్నాడు" అనే క్యాప్షన్‌తో పోస్టర్‌ను షేర్ చేశారు. ఇదే ఇప్పుడు తమిళనాడులో కొంతమంది నెటిజన్ల నుంచి తీవ్ర అభ్యంతరాలకు కారణమైంది.

తమిళ సంస్కృతిలో మురుగన్‌కు ఎంతో ప్రత్యేక స్థానం ఉంది. ఆయనను "తమిళ్ కడవుల్"గా భావించే అనేక మంది, ఈ క్యాప్షన్ తమ సంప్రదాయాన్ని తప్పుగా చూపించేలా ఉందని సోషల్ మీడియాలో అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. మురుగన్ గురించి ప్రాచీన తమిళ సాహిత్యంలోనే ప్రస్తావనలు ఉన్నాయని, అలాంటి దేవుడిని ఉత్తరాదికి చెందినవాడిగా చిత్రీకరించడం సరైన విధానం కాదని కొందరు విమర్శిస్తున్నారు.

అంతేకాకుండా పోస్టర్‌లో సంస్కృత శ్లోకాలను ఉపయోగించడం కూడా మరో చర్చకు దారితీసింది. మురుగన్ నేపథ్యంతో సినిమా రూపొందిస్తుంటే తమిళ భాషకు ప్రాధాన్యత ఇవ్వాల్సిందని, సంస్కృత శ్లోకాలను ఉపయోగించడం వల్ల తమిళ ప్రజల మనోభావాలు దెబ్బతింటాయని కొందరు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో #Boycott వంటి హ్యాష్‌ట్యాగ్‌లు కూడా ట్రెండ్ అవుతున్నాయి.

అయితే మరోవైపు నాగ వంశీకి మద్దతుగా కూడా పలువురు స్పందిస్తున్నారు. శివ పురాణం, స్కాంద పురాణం వంటి గ్రంథాల ప్రకారం కార్తికేయ స్వామి జన్మస్థలం హిమాలయ ప్రాంతమని, అనంతరం దక్షిణాదిలో ఆరాధన పొందారని వాదిస్తున్నారు. కాబట్టి నిర్మాత చేసిన వ్యాఖ్యలను ఆ కోణంలో చూడాలని సూచిస్తున్నారు.

మొత్తానికి, ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ఎన్టీఆర్ – త్రివిక్రమ్ సినిమా అప్డేట్ విడుదలైన కొద్ది గంటల్లోనే వివాదంగా మారడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ వివాదంపై చిత్రబృందం ఎలా స్పందిస్తుంది? తమిళ ప్రేక్షకుల సందేహాలను ఎలా నివృత్తి చేస్తుంది? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

ఎన్టీఆర్ – త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న కొత్త సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైన వెంటనే సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారి తీసింది. పోస్టర్‌తో పాటు నిర్మాత నాగ వంశీ చేసిన ఒక పోస్ట్ ఇప్పుడు వివాదానికి కేంద్ర బిందువుగా మారింది.

విషయంలోకి వెళ్తే… పోస్టర్‌ను బట్టి చూస్తే ఈ సినిమా సుబ్రహ్మణ్య స్వామి తత్వాన్ని ఆధారంగా చేసుకుని రూపొందుతున్నట్లు కనిపిస్తోంది. అయితే నిర్మాత నాగ వంశీ తన సోషల్ మీడియా ఖాతాలో “ఉత్తరాదిన జన్మించి, హృదయభూమిలో రూపుదిద్దుకుని, దక్షిణాదిన పూజలందుకుంటున్నాడు” అనే క్యాప్షన్‌తో పోస్టర్‌ను షేర్ చేశారు. ఇదే ఇప్పుడు తమిళనాడులో కొంతమంది నెటిజన్ల నుంచి తీవ్ర అభ్యంతరాలకు కారణమైంది.

తమిళ సంస్కృతిలో మురుగన్‌కు ఎంతో ప్రత్యేక స్థానం ఉంది. ఆయనను “తమిళ్ కడవుల్”గా భావించే అనేక మంది, ఈ క్యాప్షన్ తమ సంప్రదాయాన్ని తప్పుగా చూపించేలా ఉందని సోషల్ మీడియాలో అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. మురుగన్ గురించి ప్రాచీన తమిళ సాహిత్యంలోనే ప్రస్తావనలు ఉన్నాయని, అలాంటి దేవుడిని ఉత్తరాదికి చెందినవాడిగా చిత్రీకరించడం సరైన విధానం కాదని కొందరు విమర్శిస్తున్నారు.

అంతేకాకుండా పోస్టర్‌లో సంస్కృత శ్లోకాలను ఉపయోగించడం కూడా మరో చర్చకు దారితీసింది. మురుగన్ నేపథ్యంతో సినిమా రూపొందిస్తుంటే తమిళ భాషకు ప్రాధాన్యత ఇవ్వాల్సిందని, సంస్కృత శ్లోకాలను ఉపయోగించడం వల్ల తమిళ ప్రజల మనోభావాలు దెబ్బతింటాయని కొందరు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో #Boycott వంటి హ్యాష్‌ట్యాగ్‌లు కూడా ట్రెండ్ అవుతున్నాయి.

అయితే మరోవైపు నాగ వంశీకి మద్దతుగా కూడా పలువురు స్పందిస్తున్నారు. శివ పురాణం, స్కాంద పురాణం వంటి గ్రంథాల ప్రకారం కార్తికేయ స్వామి జన్మస్థలం హిమాలయ ప్రాంతమని, అనంతరం దక్షిణాదిలో ఆరాధన పొందారని వాదిస్తున్నారు. కాబట్టి నిర్మాత చేసిన వ్యాఖ్యలను ఆ కోణంలో చూడాలని సూచిస్తున్నారు.

మొత్తానికి, ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ఎన్టీఆర్ – త్రివిక్రమ్ సినిమా అప్డేట్ విడుదలైన కొద్ది గంటల్లోనే వివాదంగా మారడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ వివాదంపై చిత్రబృందం ఎలా స్పందిస్తుంది? తమిళ ప్రేక్షకుల సందేహాలను ఎలా నివృత్తి చేస్తుంది? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు