టాలీవుడ్లో ఒకప్పుడు తన బోల్డ్ కాన్సెప్ట్‌తో పెద్ద చర్చకు దారితీసిన ‘ఆరుగురు పతివ్రతలు’ సినిమా మరోసారి వార్తల్లో నిలిచింది. బుల్లితెరపై ఎన్నోసార్లు ప్రసారమైన ఈ చిత్రం, సోషల్ మీడియాలో మీమ్స్ కారణంగా ఇప్పటికీ ప్రేక్షకుల్లో గుర్తుండిపోయే సినిమాల్లో ఒకటిగా నిలిచింది.
ఇప్పుడు అదే సినిమాను మరోసారి థియేటర్లలోకి తీసుకురావడానికి మేకర్స్ సిద్ధమవుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఇండస్ట్రీలో రీ-రిలీజ్ ట్రెండ్ కొనసాగుతున్న నేపథ్యంలో, ప్రముఖ దర్శకుడు ఇ.వి.వి. సత్యనారాయణ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని కొత్త డిజిటల్ ప్రింట్‌తో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారట.
వైవాహిక జీవితాల్లో మహిళలు ఎదుర్కొనే భావోద్వేగాలు, సంబంధాల్లో వచ్చే సంఘర్షణలను ఇ.వి.వి. తనదైన స్టైల్లో హ్యూమర్‌తో పాటు బోల్డ్ ట్రీట్మెంట్తో ఈ సినిమాలో చూపించారు. అప్పట్లో ఈ సినిమా చర్చలకు, విమర్శలకు దారితీసినా, కమర్షియల్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుంది.
ఇప్పుడు రీ-రిలీజ్‌తో మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రం… నేటి తరం ఆడియన్స్‌ను కూడా అదే స్థాయిలో ఆకట్టుకుంటుందా? లేక కొత్త చర్చలకు కారణమవుతుందా? అనేది ఆసక్తికరంగా మారింది.








