Search
Close this search box.

  OG యూనివర్స్ స్టార్ట్.. పవన్ ఫ్యాన్స్‌కు సూపర్ సర్‌ప్రైజ్..!

June 22, 2026 9:32 PM | Aditya369 News

OG యూనివర్స్ స్టార్ట్.. పవన్ ఫ్యాన్స్‌కు సూపర్ సర్‌ప్రైజ్..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామా ‘ఓజీ’పై అభిమానుల అంచనాలు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుండగా.. ఇప్పుడు మేకర్స్ మరో క్రేజీ అప్‌డేట్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు.

‘ఓజీ’కి సీక్వెల్ రానుందనే విషయం ఇప్పటికే అధికారికంగా కన్ఫర్మ్ కాగా.. తాజాగా ‘OG Universe’కి సంబంధించిన చర్చలు అధికారికంగా ప్రారంభమైనట్లు చిత్రబృందం వెల్లడించింది. ఈ సందర్భంగా విడుదల చేసిన ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఈ ప్రత్యేక సమావేశంలో దర్శకుడు సుజీత్, పవన్ కళ్యాణ్, సంగీత దర్శకుడు థమన్ పాల్గొనడం మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది. దీంతో ‘ఓజీ’ కేవలం ఒక సినిమాగా కాకుండా భారీ యూనివర్స్‌గా విస్తరించబోతోందా అనే చర్చలు అభిమానుల్లో మొదలయ్యాయి.

ప్రస్తుతం సోషల్ మీడియాలో #OG2 హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అవుతుండగా, సీక్వెల్‌తో పాటు ప్రీక్వెల్ అవకాశాలపై కూడా అభిమానులు ఊహాగానాలు చేస్తున్నారు. ముఖ్యంగా కథలోని కీలక పాత్రలు, బ్యాక్‌స్టోరీలు, గ్యాంగ్‌స్టర్ ప్రపంచాన్ని మరింత విస్తరించే దిశగా మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.

అలాగే ‘ఓజీ’ షూటింగ్ సమయంలో ఎదురైన ఆలస్యాలు సీక్వెల్ విషయంలో జరగకుండా ముందుగానే పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. పవన్ కళ్యాణ్ కూడా ఇచ్చిన మాట ప్రకారం ప్రాజెక్ట్‌ను వేగంగా పూర్తి చేయాలని భావిస్తున్నట్లు సమాచారం.

మొత్తానికి ‘OG Universe’ అనే ఒక్క అప్‌డేట్‌తోనే పవన్ అభిమానుల్లో భారీ ఎగ్జైట్మెంట్ నెలకొంది. ఇక సుజీత్ అండ్ టీమ్ ఈ యూనివర్స్‌ను ఏ స్థాయిలో డిజైన్ చేస్తారో చూడాలి.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు