Search
Close this search box.

  నాని ‘ది ప్యారడైజ్’లో కొత్త విలన్ ఎంట్రీ.. ఈ లుక్ చూస్తే షాక్ అవుతారు..!

June 19, 2026 10:49 PM | Aditya369 News

నాని ‘ది ప్యారడైజ్’లో కొత్త విలన్ ఎంట్రీ.. ఈ లుక్ చూస్తే షాక్ అవుతారు..!

నేచురల్ స్టార్ నాని హీరోగా, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కిస్తున్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ ‘ది ప్యారడైజ్’ మరోసారి వార్తల్లో నిలిచింది. తాజాగా ఈ సినిమా నుంచి కీలక పాత్ర పోషిస్తున్న నటుడు రాఘవ్ జుయల్ ఫస్ట్ లుక్‌ను మేకర్స్ విడుదల చేయగా, అది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఈ చిత్రంలో రాఘవ్ జుయల్ ‘విక్రమ్ మాలిక్’ అనే పవర్‌ఫుల్ పాత్రలో కనిపించబోతున్నారు. విడుదలైన గ్లింప్స్‌లో మెడ నిండా బంగారు గొలుసులు, చుట్టూ మంటలు, కురుస్తున్న వర్షం మధ్య అత్యంత క్రూరమైన లుక్‌లో రాఘవ్ దర్శనమిచ్చాడు. ఇప్పటివరకు ఆయనను చూడని రీతిలో ఈ కొత్త అవతార్ ప్రేక్షకుల్లో ఆసక్తిని రెట్టింపు చేస్తోంది.

ఇప్పటికే మోహన్ బాబు ‘షికంజా మాలిక్’ పాత్రలో నటిస్తుండగా, సంపూర్ణేష్ బాబు ‘బిర్యానీ’ అనే విభిన్న పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. దీంతో సినిమాలోని పాత్రలపై మరింత క్యూరియాసిటీ పెరిగింది.

ఇక ఇటీవల ఈ సినిమా రీషూట్లపై పలు వదంతులు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. అయితే వాటిపై చిత్ర నిర్మాణ సంస్థ ఎస్ఎల్‌వి సినిమాస్ స్పష్టత ఇచ్చింది. సినిమా ప్రారంభం నుంచి పక్కా ప్రణాళికతోనే షూటింగ్ జరుగుతోందని, ఇప్పటికే 100 రోజులకు పైగా చిత్రీకరణ పూర్తైందని తెలిపింది. అంతేకాకుండా ఇప్పటివరకు ఒక్క రీషూట్ కూడా జరగలేదని, భవిష్యత్తులో కూడా అలాంటి అవసరం లేదని క్లారిటీ ఇచ్చింది.

మొదట ఈ చిత్రాన్ని 2026 మార్చి 26న విడుదల చేయాలని భావించిన మేకర్స్, ఇప్పుడు విడుదల తేదీని 2026 ఆగస్టు 21కు మార్చారు. ఓనం, రక్షాబంధన్, జన్మాష్టమి, మిలాద్-ఉన్-నబి వంటి పండుగల సెలవులు ఉండటంతో ఈ తేదీ బాక్సాఫీస్‌కు భారీగా కలిసొస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

కయాదు లోహర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. తెలుగు, హిందీ, తమిళం సహా మొత్తం 8 భాషల్లో విడుదల కానున్న ‘ది ప్యారడైజ్’పై రోజురోజుకీ అంచనాలు పెరుగుతున్నాయి. మరి నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్ మరోసారి బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తుందో లేదో చూడాలి.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు