Search
Close this search box.

  మారుతి నెక్స్ట్ హీరో ఫిక్స్ అయ్యాడా..? మాస్ మహారాజాతో క్రేజీ కాంబో టాక్..!

June 22, 2026 9:31 PM | Aditya369 News

మారుతి నెక్స్ట్ హీరో ఫిక్స్ అయ్యాడా..? మాస్ మహారాజాతో క్రేజీ కాంబో టాక్..!

ది రాజా సాబ్’ ఆశించిన స్థాయిలో బాక్సాఫీస్ వద్ద ప్రభావం చూపించలేకపోవడంతో దర్శకుడు మారుతి తన తదుపరి సినిమాను ఎవరితో చేయబోతున్నాడనే ఆసక్తి సినీ వర్గాల్లో నెలకొంది. అయితే, తన నెక్స్ట్ ప్రాజెక్ట్‌కు సంబంధించిన పనులు ఇప్పటికే ప్రారంభించినట్లు మారుతి కొద్ది వారాల క్రితమే వెల్లడించిన సంగతి తెలిసిందే.

ఇప్పుడు టాలీవుడ్‌లో ఓ ఆసక్తికరమైన వార్త చక్కర్లు కొడుతోంది. సోషల్ మీడియాలో వినిపిస్తున్న బజ్ ప్రకారం.. మారుతి తన తదుపరి చిత్రాన్ని మాస్ మహారాజా రవితేజతో తెరకెక్కించే అవకాశాలు ఉన్నట్లు టాక్ నడుస్తోంది. ఈ కాంబినేషన్ ఇప్పటివరకు ప్రేక్షకులు చూడకపోవడంతో ఈ వార్త సినీ అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది.

మారుతి స్టైల్ కామెడీ, ఎంటర్‌టైన్‌మెంట్‌కు రవితేజ ఎనర్జీ తోడైతే బాక్సాఫీస్ వద్ద మంచి మాస్ ఎంటర్‌టైనర్‌గా నిలిచే అవకాశాలు ఉన్నాయని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. అయితే ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్‌పై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

ఇక రవితేజ ప్రస్తుతం తన లేటెస్ట్ మూవీ ‘ఇరుముడి’ షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా పనులు పూర్తైన తర్వాత మారుతి-రవితేజ కాంబోపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.

మరి ఈ క్రేజీ కాంబినేషన్ నిజంగా సెట్స్‌పైకి వెళ్తుందా? లేక కేవలం గాసిప్‌గానే మిగిలిపోతుందా? అనేది తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు