Search
Close this search box.

  శక్తిమాన్ గా అల్లు అర్జున్..?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరో భారీ పాన్-ఇండియా ప్రాజెక్టుతో రాబోతున్నట్లు వార్తలు ఫిల్మ్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారాయి.. ఇండియన్ ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసిన లెజెండరీ సూపర్ హీరో ‘శక్తిమాన్’ కథతో బన్నీ సినిమా చేయబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి..ఈ భారీ ప్రాజెక్ట్‌ను ‘మిన్నల్ మురళి’ ఫేమ్ మలయాళ బాసిల్ జోసెఫ్ డైరెక్ట్ చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.. ఇప్పటికే అల్లు అర్జున్ అట్లీ డైరెక్షన్లో ఓ సూపర్ హీరో చేస్తున్నట్లు అందరికీ తెలిసిందే.. ఇప్పుడు మరో డైరెక్టర్ తో శక్తిమాన్ లాంటి మరో సూపర్ హీరో ఫిల్మ్ చేయబోతున్నట్లు న్యూస్ రావడంతో బన్నీ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు… ఇక సినిమాను సోనీ పిక్చర్స్, గీతా ఆర్ట్స్ తో పాటు రెండు ఇంటర్ నేషనల్ ప్రొడక్షన్ హౌజ్‌లు కలిసి భారీ బడ్జెట్ తో నిర్మించబోతున్నట్లు సమాచారం.. ఈ సినిమాను హైటెక్ విజువల్స్‌తో రూపొందించనున్నారు.. పురాణాల నుంచి స్ఫూర్తి తీసుకున్న డీప్ బ్యాక్‌స్టోరీతో కూడిన కథను నిర్మించే పనిలో చిత్ర బృందం నిమగ్నమై ఉందని తెలుస్తోంది…‘పుష్ప’ సిరీస్ విజయం తర్వాత బన్నీకి దేశవ్యాప్తంగా భారీ క్రేజ్ ఏర్పడింది. ఇక శక్తిమాన్ లాంటి ఐకానిక్ పాత్రలో ఆయన నటిస్తే, అది ఆయన కెరీర్‌లో ఒక గేమ్ ఛేంజింగ్ మైల్ స్టోన్ అవుతుందని ఇండస్ట్రీలో టాక్…

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు