శర్వానంద్ హీరో గా వచ్చిన గత సినిమాలు బాక్స్ ఆఫీసు దగ్గర ఆశించినంత విజయాన్ని అందుకోలేక పోయాయి.. అందుకే శర్వానంద్ కొన్ని రోజులు సినిమాలకు బ్రేక్ ఇచ్చి.. రీసెంట్ గా ఒకే సినిమాకు సైన్ చేశాడు.. ఆ సినిమా టైటిల్ ను బాలకృష్ణ హోస్ట్ గా చేసిన అన్ స్టాపబుల్ షోలో రివీల్ చేశాడు.. ఆ సినిమా టైటిల్ “నారీ నారీ మురారి” అని ఫిక్స్ చేసారు.. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరికి చేరుకుంది.. ఐతే వెంటనే శర్వా తన నెక్ట్స్ సినిమాను మొదలుపెట్టే పనిలో ఉన్నట్లు తెలుస్తుంది.. తన నెక్స్ట్ సినిమాను సంపత్ నంది దర్శకత్వంలో చేయబోతున్నట్లు తెలుస్తుంది.. ఐతే ఈ సినిమా గురుంచి ఓ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. ఈ సినిమాలో హీరోయిన్ గా అనుపమ పరమేశ్వరన్ తీసుకోబోతున్నట్లు సమాచారం..
శర్వానంద్ మరియు అనుపమ పరమేశ్వరన్ జోడీ మరొకసారి వెండితెరపై కనిపించబోతున్నారు .. శతమానం భవతి సినిమాతో వీరు మొదటిసారి కలిసినప్పటికీ, ఆ జోడీకి ప్రేక్షకులలో మంచి మార్కులు పడ్డాయి… ఇప్పుడు మరొకసారి సంపత్ నంది దర్శకత్వంలో శర్వానంద్, అనుపమల జోడీ మరో సినిమాకు సిద్ధమవుతున్నారు.
అనుపమ రీసెంట్ గా వచ్చిన రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ సినిమాలో కనిపించినప్పటికీ, ఆమె పాత్ర కేవలం కొన్ని నిమిషాలపాటు ఉన్నప్పటికీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. సంపత్ నంది -శర్వానంద్-అనుపమల సినిమా షూటింగ్ ఏప్రిల్ నెలాఖరులో ప్రారంభమవుతోందాని సినీ వర్గాల్లో టాక్…