కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రిలో జరుగుతున్న పనులు త్వరిత గతిన పూర్తి చేయ్యాలని కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సగిలి అధికా రులను ఆదేశించారు.కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ఆయన సమీక్షించారు.కాకినాడ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రులలో జరుగుతు న్న నాబార్డ్,ఇతర సివిల్ వర్క్స్ పై కలెక్టర్ ఏపీ ఎంఎస్ఐడిసి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్,జిల్లా వైద్యసేవల సమన్వయాధికారి, డైరెక్టరేట్ ఆఫ్ సెకండరి హెల్త్,కాకినాడ జిల్లా పరిధిలో గల ఆసుపత్రుల మెడికల్ సూపరింటెండెంట్, మెడికల్ ఆఫీసర్ ఇంచార్జిలతో సమీక్ష నిర్వహించారు.ఆసుపత్రిలో పనులు ఏమేమి మంజూరు అయ్యాయి,ఎంతవరకు పూర్తి అయ్యాయి,ఎప్పటికీ పూర్తి అవుతాయి వాటి ప్రస్తుత స్థితి గతులు,పూర్తి అయినవి ఆసుపత్రుల కు అప్పగించార లేదా తదితర విషయాలపై సమీక్ష నిర్వహించారు.పెండింగ్ లో ఉన్న పనులను త్వరగా పూర్తి చేయాలని మరలా దీని గురించి రెండు వారాల తరువాత సమీక్ష ఉంటుందని తెలియచేశారు.
