ఈనెల 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలు ఆటల పోటీల్లో పాల్గొనేందుకు 5, 6 తేదీలలో స్పెషల్ క్యాజువల్ లీవ్ మంజూరు చేసినట్లు కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్మోహన్ సగిలి తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జిల్లాలోని మహిళా ఉద్యోగులు అందరూ వివిధ క్రీడల్లో పాల్గొనేందుకు వీలుగా సెలవు ప్రకటించామన్నారు.
