ముస్లింలు పవిత్రంగా భావించే రంజాన్ మాసం రానే వచ్చింది. నెలవంక దర్శన మివ్వడంతో అంతటా పండుగ వాతావరణం నెలకొంది. 2వ తేది తెల్లవారుజాము నుంచి ఉపవాస దీక్షలు ప్రారంభం కానున్నాయి. అరబ్బీలో ‘రమ్జ్’ అంటే కాల్పడమని అర్థం. నెలపాటు ఉపవాస దీక్షలతో శరీరం, ఆత్మలోని మలినాలు ప్రక్షాళన కావడంతో పాటు సర్వపాపాలు దహించుకుపోతాయని ముస్లిం మతపెద్దలు చెబుతారు. మహ్మద్ ప్రవక్త బోధించిన నియమాల ప్రకారం ‘సహర్’ నుంచి ‘ఇఫ్తార్’ వర కు నీళ్లు కూడా తాగకుండా ఉపవాసం ఉంటారు.