డైరెక్టర్ వెంకీ అట్లూరి రీసెంట్ గా లక్కీ భాస్కర్ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ తన ఖాతాలో వేసుకున్నాడు. వెంకీ అట్లూరి డైరెక్షన్లో దుల్కర్ సల్మాన్ హీరోగా మీనాక్షి చౌదరి హీరోయిన్ గా బ్యాంకింగ్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.. ఈ సినిమాతో మరోసారి వెంకీ తన డైరెక్షన్ తో ప్రేక్షకులను ఫిదా చేశాడు.వెంకీ తొలి ప్రేమ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీ పరిచయం వరుస హిట్లతో ఫుల్ జోష్ లో ఉన్నాడు.. ఐతే ఈ డైరెక్టర్ తన తీసిన గత రెండు సినిమాలు తమిళ హీరో, మరో హీరో మలయాళ హీరోతో చేశాడు.. సార్ సినిమా ధనుష్ తో చేశాడు. ఐతే మరోసారి ఈ డైరెక్టర్ మరో తమిళ స్టార్ హీరోతో సినిమా చేయబోతున్నట్లు సమాచారం.. ఆ హీరో మరెవరో కాదు సూర్య .. తమిళ స్టార్ హీరోల్లో ఒకరైన హీరో సూర్య వెంకీ అట్లూరి తన నెక్స్ట్ సినిమా చేస్తున్నట్టు సమాచారం. హీరో సూర్య నటించిన కంగువ సినిమా రిలీజ్ అయ్యి బాక్స్ ఆఫీసు వద్ద డిజాస్టర్ గా నిలిచింది.. దీంతో సూర్య ఇప్పుడు కార్తీక్ సుబ్బరాజు డైరెక్షన్లో రెట్రో అనే సినిమా చేశాడు.. కేవలం 47 రోజుల్లోనే ఈ సినిమా షూటింగు పూర్తి చేసారు. ఈ సినిమా ఇప్పుడు రిలీజ్ కి రెడీ గా ఉంది. ఇందులో హీరోయిన్ గా పూజా హెగ్డే నటిస్తుంది. రెట్రో కంప్లీట్ అవ్వడంతో వెంకీ సినిమాకు ఓకే చెప్పినట్లు సమాచారం త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన రాబోతున్నట్టు తెలుస్తుంది.. ఇందులో హీరోయిన్ గా టాలీవుడ్ ఇండస్ట్రీకి మిస్టర్ బచ్చన్ సినిమాతో పరిచయమైన భాగ్య శ్రీ ని తీసుకున్నట్లు సమాచారం.ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్య దేవర నాగవంశీ నిర్మిస్తున్నట్లు టాక్ నడుస్తుంది..









