Search
Close this search box.

  పెళ్లి పీటల నుండి నేరుగా పరీక్షా కేంద్రంలోకి

పెళ్లి దుస్తులతోనే పరీక్ష కేంద్రానికి వచ్చిఅందర్నీ ఆశ్చర్యపరిచింది వధువు.తిరుపతి శ్రీ పద్మా వతి డిగ్రీ కళాశాల వద్ద గ్రూప్-2 పరీక్ష రాయటానికి వచ్చిన నూతన వధువును చూసి అంతా ఆశ్చర్యపో యారు. గ్రూప్ 2 పరీక్ష రోజునే ఆమెకు వివాహం జరిగింది. ఉదయం 6 గంటల ప్రాంతంలో వివాహం చేసుకున్న మమత. ఆ తర్వాత వెనువెంటనే పరీక్షకు హాజరైంది.

గ్రూప్ 2 పరీక్ష కోసం తిరుపతి పద్మావతి మహిళా డిగ్రీ కాలేజీ వద్ద సెంటర్లో పరీక్ష రాయడానికి జీలకర్ర బెల్లం తలపై పెట్టుకుని మరి పరీక్షకు హాజరు కావడంతో అధికారులు ఆమెను అడ్డుకున్నారు. ఆ తర్వాత పూర్తి వివరాలు చెప్పడంతో ఆమెను పరీక్ష కేంద్రం లోకి అనుమతించారు

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు