జెఎన్ టియు- కాకినాడ, యూనివర్శిటీ ఉపకులపతిగా వరంగల్ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వరంగల్ (ఎన్ఐటి) సివిల్ ఇంజనీరింగ్ విభాగం ప్రొఫెసర్ డా. సిఎస్ఆర్ కె. ప్రసాద్ నియమితుల య్యారు.ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయ నూతన వైస్ ఛాన్సలర్ గా ప్రొఫెసర్ సత్తుపాటి ప్రసన్నశ్రీని, నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ ఆదేశాల మేరకు ఉన్నత విద్యాశాఖ సెక్రటరీ కోన శశిధర్ వీసీల నియామక ఉత్తర్వులు జారీ చేశారు.









