కాకినాడ జిల్లాలో ప్రముఖ క్షేత్రమైన అన్నవరం, తలుపులమ్మ ఆలయాలకు అరుదైన అవకాశం దక్కింది. తిరుపతిలో నిర్వహించిన అంతర్జాతీయ టెంపుల్ సమ్మిట్ 17 దేశాలు, 1581 ఆలయాలతో ఐటీసీఎక్స్ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టింది. ఏపీ నుండి 8 ఆలయాలకు అవకాశం దక్కింది. వీటిలో కాకినాడ జిల్లా తుని మండలం తలుపులమ్మ లోవ,అన్నవరం దేవస్థానాల నమూనాలు సమ్మిట్లో ఏర్పాటు చేశారు. ఆధ్యాత్మకత వెల్లివెరిసే కాకినాడ జిల్లాలో దేవాదాయశాఖ ఇచ్చిన ప్రాధాన్యతతో అంతర్జాతీయ స్థాయిలో ఈ రెండు ఆలయాలకు ప్రాధాన్యత దక్కింది.
