ఏపీలో ఇటీవల జరుగుతున్న వరుస అరెస్టులపై మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ ప్రభుత్వం తీరుపై నిప్పులు చెరిగారు. ప్రభుత్వం మాటలు విని వైసిపి నాయకులను అరెస్టులు చేస్తున్న పోలీసులను జగన్మోహన్ రెడ్డి హెచ్చరించారు. వంశీ అరెస్టు సందర్భంలో ఓ సీఐ తాను ఏడాదిన్నరలో రిటైర్ కాబోతున్నానని చెప్పారని తనని ఎవరేం చేయగలరని అన్నారని జగన్ గుర్తు చేశారు. ఇలాంటి సందర్భంలో పోలీసులకు, వైసిపి పై కుట్రలు పన్నుతున్న వారందరికీ ఒకటే చెబుతున్న.. సప్త సముద్రాలు దాటినా వీరిని వదిలే ప్రసక్తి లేదు.. బట్టలు ఊడ దీయించి నిలబెడతానంటూ జగన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. వంశీ తో ములాఖత్ అనంతరం జగన్ మీడియాతో మాట్లాడి కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను ఎండగట్టారు.
