కలెక్టర్ కార్యాలయం నుంచి చీడిగ గ్రామం వరకూ ఉన్న మూడు ఎటియం లను సక్రమ నిర్వహణ చేయమని కోరుతూ ఎస్బిఐ జనరల్ మేనేజరు కు సిపిఎం నాయకులు వినతి పత్రం అందజేశారు.గత పదిరోజులుగా ఈ ప్రాంతంలోని ఎటియంల నందు నగదు అందుబాటులోలేక ప్రజలు,పెన్షనర్లు ఉద్యోగులు,వ్యాపారులు,తీవ్ర ఇబ్బంది పడుతున్నారని ఎసి ల పనితీరు సరిగా లేకుండా ఉంటున్నాయన్నారు.సిజియం మాట్లాడుతూ క్యాష్ లేకపోవడం వాస్తవమేనని,క్యాష్ లోడింగ్ చేసే సంస్థ తో కొన్ని సమస్యలు ఉన్నాయని ,వాటిని సరిచేసి మరొక ఏజన్సీ కి బాధ్యత అప్పగించే పని చేస్తున్నామని ,సమస్య పరిష్కారానికి కొంత సమయం పడుతుందన్నారు.
