కాకినాడ జిల్లాలో పెండింగ్‌లో ఉన్న పెన్షన్ కేసులు/జిపిఎఫ్ కేసులను సమీక్షించడానికి,పరిష్కరించడానికి డీడీఓలకు సమర్ధవంతంగా సేవల ను,జిపిఎఫ్ సమయానికి అందించడానికి ఈ నెల 21న”పెన్షన్,జిపిఎఫ్ అదాలత్”నిర్వహిస్తున్నామని కాకినాడ జిల్లా కలెక్టర్ షన్మోహన్ సగిలి తెలిపారు.పైన పేర్కొన్న వాటిని దృష్టిలో ఉంచుకుని,జిల్లాలోని జిల్లా అధికారులు/డ్రాయింగ్&పంపిణీ అధికారులు 21న కాకినాడ కలెక్టర్ కార్యాలయ ఆవరణలో గల”విధాన గౌతమి మీటింగ్ హాల్”లో ఉదయం 10.00 గంటలకు నిర్వహించే “పెన్షన్,జిపిఎఫ్ అదాలత్‌తో పాటు పెండింగ్‌లో ఉన్న పెన్షన్ కేసులు /జిపిఎఫ్ సమస్యలు వివరాలతో హాజరు కావాలని కలెక్టర్ కోరారు.
