దాడికి గురైన చిలుకూరు బాలాజీ దేవాలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ ను తెలంగాణ జనసేన నాయకులు పరామ ర్శించారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు తెలంగాణ జనసేన నాయకులు మహేందర్ రెడ్డి,శంకర్ గౌడ్ లు అర్చకులు నివాసానికి చేరుకుని ఆయనపై జరిగన దాడి వివరాలను అడిగి తెలుసుకున్నారు. దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.ఎటువంటి భయభ్రాంతులకు లోనవ్వద్దని తాము అర్చకులకు అండగా ఉంటామని భరోసా నిచ్చారు.
