ఏపీలో బెజవాడ రైల్వేస్టేషన్ కు మరో ఘనత దక్కింది. వార్షికాదాయం రూ.500 కోట్లు అధిగమించి, ఎన్ఎ-1 హోదా ను సొంతం చేసుకుంది. కీలకమైన అమరావతి రాజధాని పరిధిలోని ఈ రైల్వేస్టేషన్ దేశంలోని టాప్-28 స్టేషన్లలో ఎలైట్ గ్రూప్లో చేరింది.దక్షిణ మధ్య రైల్వే పరిధిలో సికింద్రాబాద్ తరువాత ఈహోదా సాధించిన రెండో స్టేషన్ గా నిలిచింది.
