కాకినాడ జిల్లాలో ఏలూరు ప్రాజెక్టు నుండి భారీగా నీటిని కిందకు వదులుతున్నారు.24 టీఎంసీల సామర్థ్యం గల ఏలేరు ప్రాజెక్టులో 21 టీఎంసీల నీరు చేరింది. అధికారులు 7వేల క్యూసెక్కులకు పైగా నీటిని విడుదల చేశారు. దీంతో లోతట్టు ప్రాంతాలను అధికారులు అప్రమత్తం చేశారు. శివారు ప్రాంతమైన పిఠాపురం నియోజకవర్గం పై ఏలేరు నీటి ముంపు ప్రభావం ఎక్కువగా ఉండనుంది.
