డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 9న కాకినాడ జిల్లాలో పర్యటించను న్నారు. కాకినాడ కలెక్టరేట్ కార్యాలయంలో తుఫాను ప్రభావంపై కలెక్టర్, ఇతర అధికారులతో సమీక్ష చేయనున్నారు. ప్రత్యేక విమానంలో పవన్ సోమవారం ఉదయం రాజమండ్రి చేరుకుంటారు. అక్కడినుండి కాన్వాయ్ ద్వారా ప్రత్తిపాడు హైవే మీదుగా కాకినాడ చేరుకుంటారు.
