పిఠాపురం పట్టణంలో కొత్తపేటలో ఉన్న శ్రీకృష్ణుని ఆలయం వద్ద భారీ అన్నసంతర్పణ జరిగింది.శ్రీ కృష్ణాష్టమి ఉత్సవాలలో భాగంగా అన్న సంతర్పణ నిర్వహించారు. ప్రతి ఏటా ఇక్కడ శ్రీ కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా చేస్తారు. శ్రీకృష్ణుడికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. అనంతరం ప్రసాద వితరణ జరిగింది. శ్రీకృష్ణ ఆలయ కమిటీ సభ్యులు, యువకులు, పెద్దలు కార్యక్రమాన్ని పర్యవేక్షించారు
