కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం తాటిపర్తి గ్రామంలో కొలువైన అపర్ణాదేవి అమ్మవారిని, శ్రావణ శుక్రవారం పురస్కరించుకుని పదివేల గాజులతో అలంకరించారు. ఆలయంలో మహిళా భక్తులు వ్రత పూజలు నిర్వహించారు. ప్రతి ఏటా ఇక్కడ శ్రావణమాసంలో అమ్మవారిని గాజులతో ప్రత్యేకంగా అలంకరించి కుంకుమార్చనలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.
