కాకినాడ జిల్లా పిఠాపురం లో ఈనెల 24న జాబ్ మేళా నిర్వహించనున్నారు. దాదాపు 30 కంపెనీల ప్రతినిధులు ఈ జాబ్ మేళాకు రానున్నారు. పదవ తరగతి, ఇంటర్, డిగ్రీ ,పీజీ ,ఇంజనీరింగ్ విభాగాల్లో విద్యను పూర్తి చేసిన వారు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. కాకినాడ వికాస ఆధ్వర్యంలో పిఠాపురంలో అంజనా కాలేజ్ , ఎస్ ఎఫ్ ఎస్ పాఠశాల వేదికగా జాబ్ మేళా జరగనుంది.
