కాకినాడ జిల్లా ఉప్పాడ- కొత్తపల్లి మండలం కొత్త మూలపేట వద్ద జరిగిన ఆటోలు ఎదురెదురుగా ఢీకొన్న ప్రమాదంలో కోనపాపేటకు చెందిన బాలిక ఉప్పరపల్లి దేవి (12) అక్కడికక్కడే మృతి చెందింది. రాఖి పౌర్ణమి పురస్కరించుకొని ఉప్పాడ లోని బంధువుల ఇంటికి వెళ్లి తిరిగి ఆటోలో కొనపాపేట వస్తున్నారు. మార్గంలో కొత్త మూలపేట మలుపులో పేరు ప్రయాణిస్తున్న ఆటోను ఎదురుగా మరొక ఆటో బలంగా ఢీకొట్టడంతో ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో మరొక బాలిక కస్తూరి కి తీవ్ర గాయాలు కావడంతో పరిస్థితి విషమంగా మారింది. ఇదే ప్రమాదంలో ఆటో డ్రైవర్ తో కలిపి మరో ఐదుగురుకి తీవ్ర గాయాలు కావడంతో వారిని ప్రభుత్వ ఆసుపత్రి తరలించి చికిత్స అందిస్తున్నారు
