కాకినాడ జిల్లా పిఠాపురంలో అన్న క్యాంటీన్ ను అటహాసంగా ప్రారంభించారు. జనసేన ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ, పిఠాపురం జనసేన ఇన్చార్జ్ శ్రీనివాస్, బిజెపి ఇంచార్జ్ కృష్ణంరాజు సంయుక్తంగా ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ఉదయం అల్పాహారం తో అన్న క్యాంటీన్ ప్రారంభమైంది. పెద్ద సంఖ్యలో టిడిపి, జనసేన, బిజెపి కార్యకర్తలు పాల్గొన్నారు
